RRR Movie Team Vs Rajasthan Royals: ఓటమి గెలుపునకు దారి చూపించాలి. ఆటగాళ్లలో కసిని పెంచాలి. విజయం సాధించాలనే కాంక్షను రగిలించాలి. అదేంటో కానీ రాజస్థాన్ రాయల్స్ టీం ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. తనపై గెలిచిన ప్రత్యర్థి జట్టును మరింతగా గేలి చేస్తోంది. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో సినిమాలను వాడుకుంటూ మరింతగా రెచ్చగొడుతోంది..ఇది చినికి చినికి గాలి వాన లాగా మారి ఏకంగా క్షమాపణలు చెప్పేదాకా వెళ్ళింది. ఇంతకీ ఏం జరిగిందో మీరూ చదివేయండి.
సన్ రైజర్స్ గెలిచింది
ఐపీఎల్ 17వ ఎడిషన్లో హైదరాబాద్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేక పోతోంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ హైదరాబాద్ జట్టు బలమైన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మొన్న తలపడింది. వరుసగా మ్యాచ్లు ఓడిపోతుంది కాబట్టి అభిమానులకు కూడా సన్ రైజర్స్ మీద ఎటువంటి అంచనాలు లేవు. ఎలాగూ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో సన్ రైజర్స్ రెచ్చిపోయి ఆడింది. మ్యాచ్ చివరిలో ఫోర్లు, సిక్స్ లు కొట్టి విజయం సాధించింది. అయితే తనపై సన్రైజర్స్ జట్టు గెలుపొందడాన్ని రాజస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది.. అసహనంతో ఊగిపోయి ఒక నెత్తి మాసిన ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నది. తమ కెప్టెన్ సంజు శాంసన్ ఆర్ఆర్ఆర్ సినిమా కంటే గ్రేట్ అని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడమే ఈ వివాదానికి కారణమైంది. వాస్తవానికి ఒక టీం తమ జట్టు కెప్టెన్ పై పొగడ్తల వర్షం కురిపించుకోవడం సర్వ సాధారణం. కానీ రాజస్తాన్ రాయల్స్ టీం మధ్యలో ఈ ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చింది అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే సన్ తెలుగు జట్టు కావడంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తావన తీసుకొచ్చింది అని కొంతమంది అంటున్నారు.
దుమ్మెత్తి పోశారు
ఆర్ ఆర్ ఆర్ ను మధ్యలోకి తీసుకురావడంతో రాజస్థాన్ రాయల్స్ టీం పై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. దేశానికి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన సినిమాను మధ్యలోకి లాగడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు రకరకాల మీమ్స్ తో చెలరేగిపోయారు. ఇక తనను తక్కువ చేసి మాట్లాడిన రాజస్థాన్ రాయల్స్ టీం పై ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం కూడా రెచ్చిపోయింది. రాజస్థాన్ రాయల్స్ చేసినటువీటుకు రిప్లై గా వెంకీ సినిమాలో రవితేజను బ్రహ్మానందం కొట్టే వీడియోను పోస్ట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ ను నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి రిప్లై ఇచ్చింది. ఇడియట్ సినిమాలోని “తొక్క తీస్తా, పెట్టురా సంతకం, ఫ్యాన్స్, బిల్డప్, పెట్టు త్వరగా” అంటూ 30 ఇయర్స్ పృథ్వి శ్రీనివాసరెడ్డిని లాగి ఒక్కటి ఇచ్చే వీడియోను షేర్ చేసింది. దీంతో దెబ్బకు తప్పు తెలుసుకున్న తప్పు తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. “ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎంత హిట్ అయిందో మాకు తెలుసు. అందుకే మా క్షమాపణలు కూడా ప్రపంచవ్యాప్తంగా రీచ్ అయ్యేలాగా చెబుతున్నాం. సంజు శాంసన్, ఆర్ ఆర్ ఆర్ రెండూ నాకు ఇష్టమైన వే అంటూ” ట్వీట్ చేసింది. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
https://t.co/ZkOjjssgNC pic.twitter.com/LebAQu4cGX
— DVV Entertainment (@DVVMovies) May 7, 2023
https://t.co/onKCCcm58U pic.twitter.com/P7tPufnbEk
— RRR Movie (@RRRMovie) May 7, 2023
SSS (skipper sanju samson) > RRR
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2023