
Pawan Kalyan Fan- RRR Makers: #RRR లాంటి ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ తర్వాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో #OG అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమధ్యనే ముంబై లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూవీ టీం.
ఇప్పటికే ఒక స్పెషల్ వీడియో తో పాటుగా , హీరోయిన్ ప్రకటన మరియు పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ ఫోటోలను అప్లోడ్ చేసి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నింపేశారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ #RRR కంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనే విషయం అర్థం అవుతుంది. బహుశా మూవీ టీం మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబోలు, ఎంతో ఉత్సాహంతో ట్విట్టర్ లో అభిమానులతో మమేకం అవుతున్నారు.
ఇక నేడు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ట్విట్టర్ లో రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసింది మూవీ టీం. అయితే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని, ఈద్ ముబారక్,మీ OG టీం నుండి నాకు బిర్యానీ ఆర్డర్ చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ రిప్లై ఇస్తూ ‘ఓకే..మీ అడ్రెస్స్ మెసేజి చెయ్యి.ఈద్ ముబారక్’ అని రిప్లై ఇస్తాడు. అప్పుడు ఆ అభిమాని అడ్రెస్స్ మెసేజి చెయ్యగా వెంటనే అతని అడ్రెస్స్ కి మెరిడియన్ బిర్యానీ పార్సెల్ చేసాడు.
అప్పుడు అభిమాని ఆనందంతో ఫోటో తీసి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ హ్యాండిల్ ని ట్యాగ్ చేసి థాంక్స్ చెప్పాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా అభిమానులతో ఇంతలా మమేకం అయిన ప్రొడక్షన్ హ్యాండిల్ ఇప్పటి వరకు లేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో కెరీర్ లోనే ‘ది బెస్ట్’ ప్రొడక్షన్ హౌస్ తగిలిందని, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రొడక్షన్ తో పనిచేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Meridian Mutton Biryani 😋😋😋 Received Brother @DVVMovies Thank You … Kalyan anna ni Jagratha ga chusukondi☺️☺️ https://t.co/yffsbTp94F pic.twitter.com/qYMVCm0uOj
— アローンサーチャー _#OG 🗡️⚔️ (@alone_searcher) April 22, 2023