Bigg Boss Sunny: బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీపై రౌడీషీటర్ దాడి.. అసలు వివాదమేంటి? ఎందుకు జరిగింది?

Bigg Boss Sunny: ఒక మామూలు విజేగా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన సన్నీ ఆ తర్వాత తన మంచి ప్రవర్తనతో ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సన్నీకి క్రేజ్ వచ్చింది. ఈ ఊపులోనే వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ సినిమాలతోనే సన్నీ మస్త్ బిజీగా ఉన్నాడు. తాజాగా హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ […]

Written By: NARESH, Updated On : June 9, 2022 8:56 am
Follow us on

Bigg Boss Sunny: ఒక మామూలు విజేగా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన సన్నీ ఆ తర్వాత తన మంచి ప్రవర్తనతో ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సన్నీకి క్రేజ్ వచ్చింది. ఈ ఊపులోనే వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ సినిమాలతోనే సన్నీ మస్త్ బిజీగా ఉన్నాడు.

తాజాగా హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని హస్తినాపురం లో దిల్ రాజు ప్రొడక్షన్ లో విజే సన్నీ హీరో గా నటిస్తున్న ‘ఏటీఎం’ సినిమా షూటింగ్ లో ఓ రౌడీ షీటర్ అకస్మాత్తుగా ఊడిపడి ఏకంగా సన్నీపై దాడికి ప్రయత్నించాడు. హీరోపై దాడికి ప్రయత్నించగా వెంటనే సిబ్బంది సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా వీజే సన్నీతో ఆ రౌడీషీటర్ కు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు.సెలబ్రెటీలపై దాడులు చేస్తే హైలెట్ అవుతారన్న కోణంలో దాడికి పాల్పడే ప్రయత్నం చేసారేమో అని సిబ్బంది భావిస్తున్నారు. ప్రస్తుతం రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

బిగ్ బాస్ షో తర్వాత సన్నీ ‘సలక గుణాభిరామ’ సినిమాలో హీరోగా నటించాడు. సన్నాఫ్ ఇండియా డైరెక్టర్ డైమండ్ రత్నబాబుతో కొత్త మూవీని ప్రకటించాడు.

-సన్నీ బయోగ్రఫీ
1989లో సన్నీ ఖమ్మంలో పుట్టాడు. అతడి అసలు పేరు ‘అరుణ్ రెడ్డి’. సన్నీ తల్లి కళావతి స్టాఫ్ నర్సు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్. సన్నీ 10వ తరగతి వరకూ ఖమ్మంలోనే చదివాడు. ఇంటర్ సీఈసీ గ్రూపులో ఫస్ట్ ఇయర్ ఖమ్మంలో చేశాడు. తల్లి బదిలీ కావడంతో సెకండర్ కరీంనగర్ లో పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీకాం చదివాడు. ఆ తర్వాత ‘జస్ట్ ఫర్ ఫన్’ టీవీ షోతో యాంకర్ గా మారాడు. ప్రముఖ న్యూస్ చానెల్ లో రిపోర్టర్ గా పనిచేసి సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి సన్పీ పాపులర్ అయ్యాడు. అనంతరం ‘కళ్యాణ వైభోగం’ సీరియల్ లో ద్వారా ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. బిగ్ బాస్ తో స్టార్ గా మారాడు.