Romantic Robots: పడక గదిలోకి ఏఐ.. శృంగార కోర్కెలు తీర్చబోతున్న ఆర్టిఫీషియల్‌ రోబోలు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇక రాబోయే రోజుల్లో మనకు శృంగార సౌక్యాలను కూడా కల్పించనుంది. ఏఐ ఆధారిత సెక్స్‌ రోబోలు నిజమైన లైంగిక భాగస్వామినలా వ్యవహరిస్తాయని గూగుల్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేసిన మొహమ్మద్‌ గవాదత్‌ తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : August 3, 2023 8:25 am

Romantic Robots

Follow us on

Romantic Robots: ‘పనిముట్లను తయారు చేసే జీవి మనిషి’ అన్నాడు బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌. తన శారీరక, మేధో శ్రమల్ని తగ్గించుకోవడానికి, సౌఖ్యాలను ఆస్వాధించడానికీ మనిషి నిరంతరం కొత్త యంత్రాలను, పరికరాలను కనిపెడుతూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఆవిష్కృతమైంది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. అయితే యంత్రాలనేవి ప్రమాదాలతోపాటే వస్తాయి. ప్రయోజనాలతో పోలిస్తే నష్టాలు తక్కువేనన్న నమ్మకంతోనే మానవజాతి యంత్ర పరిశోధనలను కొనసాగిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రయోజనాలకన్నా ప్రమాదాలే ఎక్కువగా ఉండే యంత్రాలను కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మనిషి సృష్టించిన కృత్రిమ మేధ.. మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారబోతోంది. దీంతో కృత్రిమ మేధ/ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రయోజనాలు, ప్రమాదాల గురించి కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొందరు దీనిని సాంకేతిక సమస్యగా చూస్తుంటే, మరి కొందరు సామాజిక సంక్షోభంగా చూస్తున్నారు.

అన్ని పనులు చేసేలా..
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మనిషి చేసే అన్ని పనులు చేసేలా రోబోలు తయారవుతున్నాయి. ఇటీవలే ఒడిశాలో ఓ టీవీ చానెల్‌ ఏఐ సహాయంతో న్యూస్‌ రీడర్‌ను కూడా రూపొందించింది. త్వరలోనే ఈ ఏఐ మన జీవితంలో భాగం కావడం కాయం.. జీవితంలో భాగమే కాదు.. జీవిత భాగస్వామిగా కూడా అవుతుందని అంటున్నారు సైంటిస్టులు. చివరకు పడక గదికి కూడా ఏఐ రోబోలు వస్తాయని, జీవిత భాగస్వామి ఇచ్చే సుఖాన్ని కూడా ఇస్తాయని పేర్కొంటున్నారు.

రోబోలతో ఎంజాయ్‌ చేయవచ్చు..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇక రాబోయే రోజుల్లో మనకు శృంగార సౌక్యాలను కూడా కల్పించనుంది. ఏఐ ఆధారిత సెక్స్‌ రోబోలు నిజమైన లైంగిక భాగస్వామినలా వ్యవహరిస్తాయని గూగుల్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేసిన మొహమ్మద్‌ గవాదత్‌ తెలిపారు. ఇటీవల ఆయన యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంపాక్ట్‌ థియరీ ఇంటర్వ్యూలో కృత్రిమ మేధ వల్ల కలిగే శృంగార భావాల గురించి ఆయన వెల్లడించారు. శృంగార భాగస్వామి ఎలా మనల్ని రంజింప చేస్తారో.. ఆ రీతిలోనే ఏఐ ఆధారిత సెక్స్‌ రోబోలు కూడా మనల్ని థ్రిల్‌ చేస్తాయని గవాదత్‌ తెలిపారు. నిజమైన భాగస్వామితో ఎంత ఎంజాయ్‌ చేస్తామో.. ఆ స్థాయిలోనే సెక్స్‌ రోబోలు కూడా మనల్ని మైమరిపింప చేస్తాయట. వర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్స్‌తో ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతాయని గవాదత్‌ తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్ధితో నిజమైన, అవాస్తవిక బంధాల మధ్య వ్యత్యాసం తగ్గుతుందన్నారు. మనుషుల్లో ఉండే ప్రేమ, ఇతర భావాలకు సంబంధించిన ఎమోషన్స్‌ కనుమరుగవుతాయన్నారు.

ప్రత్యేకమైన హెడ్‌సెట్స్‌తో..
యాపిల్‌ కంపెనీకి చెందిన విజన్‌ ప్రో, లేదా క్వెస్‌ 3 లాంటి ప్రత్యేకమైన హెడ్‌సెట్స్‌తో మనుషులు కృత్రిమ రీతిలో సంభోగ ఆనందాన్ని పొందవచ్చు గవాదత్‌ తెలిపారు. అయితే ఇలాంటి హెడ్‌సెట్స్‌తో ఏఐ ఆధారంగా.. నిజంగానే మనం సెక్స్‌ రోబోలతో ఇంటరాక్టు చేస్తున్నట్లు ఉంటుందన్నారు. ఒకవేళ ఏఐతో మనం మనుషుల ఎమోషన్స్‌ను సృష్టించగలిగితే, అప్పుడు ఏది నిజమో, ఏది కాదో చెప్పడం కష్టమని అన్నారు. టెక్నాలజీ నేరుగా మన మెదళ్లతో కనెక్ట్‌ అవుతుందని, దీని వల్ల మనం నేరుగా మనకు కావాల్సిన వ్యక్తితో మాట్లాడుతున్నామన్న భ్రమ కలుగుతుందన్నారు. ఇలాంటి సందర్భాల్లో మనకు నిజమైన భాగస్వామి అవసరం రాదని తెలిపారు. అప్పుడు కృత్రిమ రీతిలోనే శృంగారాన్ని ఎంజాయ్‌ చేస్తామని పేర్కొన్నారు.

ప్రేమ, సంబంధాలు భిన్నరీతిలో..
ప్రేమ, సంబంధాల గురించి ఏఐ చాలా విభిన్నరీతిలో ఆలోచిస్తుందని గవాదత్‌ తెలిపారు. టెక్నాలజీ మెరుగు అవుతున్నా కొద్దీ.. మనుషులు.. కృత్రిమ సంబంధాల మధ్య తేడాను గుర్తించలేమన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత భాగస్వామ్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. సమాజం వీటిని ఆమోదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.