Roja- Mega Family: పచ్చకామెర్లు ఉన్నవాళ్ళకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అలాగే దందాలు, దౌర్జన్యాలు చేసేవారికి మిగతావారు కూడా అలాగే కనిపిస్తారు.. ఎందుకంటే అది దృష్టిలోపం. వారిలోపం.. కానీ ఆ లోపాలను వారు సవరించుకునే ప్రయత్నం చేయరు.. పైగా ఎదురు తిరుగుతారు.. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్నలు వేస్తారు. ఆ కోవకే చెందుతారు నగరి ఎమ్మెల్యే రోజా. ఆమె నోటికి అదుపు ఉండదు.. అందితే కాళ్లు… లేకుంటే జుట్టు. అది ఆమె నైజం.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆమెను నోరుకు అడ్డు అదుపు ఉండేది కాదు. ఆమె ముహూర్తానా అయితే తెలుగుదేశంలో చేరారో పార్టీ మొత్తం సర్వం భ్రష్టు పట్టిపోయింది. తర్వాత వైఎస్ఆర్సిపి లో చేరారు. అప్పుడు కూడా సేమ్ సీన్. కానీ 2019లో మాత్రం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల పాటు ఆమెకు పెద్దగా పదవులు ఏమి ఇవ్వలేదు.

చరిత్ర మర్చిపోతే ఎలా
గతంలో జగన్ తరఫున కొడాలి నాని మాట్లాడేవారు.. ఇప్పుడు రోజా మాట్లాడుతున్నారు. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏనాడూ ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టని రోజా ఇవాళ మెగా కుటుంబాన్ని విమర్శిస్తోంది.. ఆఫ్ కోర్స్ ఆమె వెనుక ఎవరు ఉన్నారనేది తెలిసిందే . కానీ ఒక్కసారి విమర్శలు చేసే ముందు రోజా ఆలోచించుకోవాలి.. ఇవాళ మంత్రి పదవి ఉండొచ్చు. రేపు పోవచ్చు.. కానీ బంధాలు శాశ్వతం.. కానీ ఇవేవీ గుర్తు ఎరుగని రోజా ఇష్టానుసారంగా మాట్లాడుతోంది..ఫర్ డిబేట్ సేక్.. రోజా, ఆమె సోదరుడు డాలర్ డ్రీమ్స్ పేరుతో అప్పట్లో ఒక వెంచర్ ప్రారంభించారు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి తర్వాత బోర్డు తిప్పేశారు. చాలామంది ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టారు. దుర్గ సినిమా తీసి నిండా అప్పుల్లో మునిగినప్పుడు అప్పుడు మెగా కుటుంబమే ఆమెను చేరదీసింది. ఆమె మంత్రి అయిన తర్వాత నేరుగా వచ్చింది కూడా ఆ మెగా కాంపౌండ్ లోకే.. ఆశీస్సులు తీసుకుంది కూడా ఆ చిరంజీవే కాళ్లకు నమస్కరించే. ఇవేవో ఆమెను విమర్శించేందుకు చేస్తున్నవి కాదు… నిప్పులాంటి నిజాలు.. ఒకసారి గూగుల్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇవాళ ఏదో మంత్రి పదవిలో ఉన్నానని రోజా విర్రవీగితే అది ఆమె కర్మ. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎంతో మంది రోజాలను చూశాడు.. ఇక ముందు చూస్తూనే ఉంటాడు.. ఎందుకంటే తనకు గిట్టని వాళ్లను తిట్టించడంలో ఆయన పైశాచిక ఆనందం పొందుతాడు కాబట్టి. మొన్నటికి మొన్న గుడివాడ ఎమ్మెల్యే ఇలానే రెచ్చిపోయేవాడు.. కానీ ఇప్పుడు ఆయనకు తత్వం బోధపడింది. అందుకే మూసుకొని కూర్చుంటున్నాడు.

మెగా ఫ్యామిలీ ఇది చేసింది
చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలబడుతున్నారు.. అంతటి కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు.. సినీ కార్మికులకి నిత్యవసరాలు అందజేశారు.. ఏ అవసరం ఉన్నా కూడా పరిశ్రమ ఆయన గుమ్మం వైపే చూస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయలను కౌలు రైతులకు పరిహారంగా ఇస్తున్నారు.. కానీ ఇదే సాంస్కృతిక శాఖ, క్రీడా శాఖ వెలగబెడుతున్న రోజా చేస్తున్నది ఏమీ లేదు. జగన్ సేవలో తరించడం తప్ప. జబర్దస్త్ యాక్టర్లను తీసుకొని వెళ్ళి తిరుపతి తన బాబు సొత్తు అయినట్టు బ్రేక్ దర్శనం చేయిస్తోంది.. తన కార్యకర్తలను కూడా తిరుపతి తీసుకొచ్చి నానా హంగామా సృష్టిస్తోంది. ఈవిడ గారి ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం నానాటికి దిగజారి పోయింది. ప్రస్తుతం బ్యాంకు చివరివరస లో మూడో స్థానంలో ఉంది. అన్నట్టు పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆమె అత్యంత విలాసవంతమైన కారు కొనుగోలు చేసింది.. మరి ఆ కొనుగోలుకు సహకరించిన శక్తి ఎవరో రోజానే చెప్పాలి. పెద్దిరెడ్డి ఇప్పటికీ ఆమెను మంత్రిగా ఎందుకు అంగీకరించడో రోజా వివరించాలి. అంతేకానీ జబర్దస్త్ స్క్రిప్ట్ మాదిరి డైలాగులు వల్లే వేసి విలేకరుల ఎదుట మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం.. అన్నింటికీ మించి ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది ఎక్కడికి చేరుతుందో తెలుసుకోకపోవడం ముదనష్టపు తనం.. ఇక్కడ ఆకాశం ఎవరో చెప్పాల్సిన పనిలేదు… అది గుర్తు ఎరిగితే రోజాకు చాలా మంచిది.