Roja Daughter: ఆర్కే రోజా.. వెండితెర, బుల్లితెరలో విపరీతమైన పాపులారిటీని సంపాదించారు. స్టార్ డంను సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసుకున్నారు. మంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా రోజా కుమార్తె అన్షు మాలిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తల్లికి తగ్గ తనయగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రోజాను వ్యతిరేకించే వారు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు.
అన్షు మాలికది సేమ్ తల్లి పోలికే. ఆ నవ్వు, స్పందించే తీరు తల్లి రోజా లాగే ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. దీంతో కొందరుఆమె తల్లి రోజాను ప్రస్తావిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.మీ తల్లిలా టాలెంట్ చూపిస్తున్నావ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.అదే సమయంలో కొందరు కామెంట్స్ ఖండిస్తున్నారు. పనికిమాలిన పాలిటిక్స్ లో పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రోజా ఏమైనా అంటే ఆమెకు సమాధానం చెప్పాలి కానీ.. ఆమె కూతురిపై ఎందుకు నోరు పారేసుకుంటున్నారు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
వాస్తవానికి అన్షు మాలిక ప్రాథమిక స్థాయి నుంచే అన్ని అంశాలపై అవగాహన ఉంది. వెబ్ డెవలపర్ గా, కంటెంట్ క్రియేటర్ గా రాణిస్తున్న ఆమె మంచి రైటర్ కూడా.ఆమె రాసిన పుస్తకాలకు అవార్డులు లభించాయి. జీ టౌన్ మ్యాగజైన్ నుంచి సౌత్ ఇండియా బెస్ట్ ఆతర్ అవార్డు లభించింది. బాల్యంలోనే ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పుస్తకాన్ని రాశారు. అటు సోషల్ సర్వీస్ లోనూ ఆమె ముందున్నారు. చీర్స్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాదులో ఐదుగురు పిల్లలను చదివిస్తున్నారు.