Homeక్రీడలుRohit Sharma: తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన రోహిత్ శర్మ

Rohit Sharma: తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన రోహిత్ శర్మ

Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతూ ఉండడంతో వేలాదిగా అభిమానులు స్టేడియాలకు వస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ – ముంబై జట్టు మధ్య హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 25వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ వచ్చిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. అభిమానులకు తెలుగులో ఇచ్చిన పిలుపు ఎంతో ఆసక్తికరంగా మారింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై జట్టు రెండు విజయాలు నమోదు చేసుకొని.. మరో రెండు జట్లపై ఓటమి చూసింది. పాయింట్లు పట్టికలో కింద నుంచి మూడో స్థానంలో ఉంది ముంబై జట్టు. మంగళవారం హైదరాబాద్ జట్టుతో ముంబై జట్టు తలపడనుంది. హైదరాబాద్ జట్టు కూడా ముంబై జట్టు మాదిరిగానే రెండు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్లు పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్ జట్లకు కీలకము కావడంతో వ్యూహ.. ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.

ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కి.. తెలుగులో కోరిన రోహిత్..

హైదరాబాద్ తో మ్యాచ్ ఆడేందుకు ముంబై జట్టు హైదరాబాదు నగరానికి సోమవారం సాయంత్రం చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ‘మేము వచ్చేసాం.. ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కి’ అని రోహిత్ శర్మ అభిమానులకు పిలుపునిచ్చాడు. రోహిత్ తెలుగులో మాట్లాడడంతో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోహిత్ శర్మకు బంధువులు కూడా ఉన్నారు. పలు మార్లు విశాఖపట్నంలో ఉన్న తన బంధువులు ఇళ్లకు కూడా రోహిత్ శర్మ వెళ్లారు. అందుకే రోహిత్ శర్మ తెలుగు మాట్లాడగలుగుతున్నాడని పలువురు అభిమానులు చెబుతున్నారు.

జూలు విదల్చాల్సి ఉన్న రోహిత్ శర్మ..

ఐపీఎల్ 16వ ఎడిషన్ లో రోహిత్ శర్మ తన స్థాయిలో ఆటను ప్రదర్శించడం లేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో పది బంతులాడిన రోహిత్ శర్మ ఒకే ఒక పరుగు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మరో మ్యాచ్లో 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన టచ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ గర్జించాడు. 45 బంతుల్లోనే 65 పరుగులు చేసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కోల్కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్ ల్లో 107 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ స్థాయిలో మరిన్ని ఇన్నింగ్స్ లు ఆడాల్సిన అవసరం ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ ఎంత బాగా ఆడితే జట్టుకు అంత ఉపయోగపడుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Rohit Sharma
Rohit Sharma

ఇరుజట్లకు అత్యంత కీలకం..

ఉప్పల్ వేదికగా జరగనున్న మంగళవారం నాటి మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. రెండు జట్లు రెండు రెండు విజయాలతో పాయింట్లు పట్టికలో కింది నుంచి రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్ రేట్ తో విజయం సాధించడం ద్వారా ముందుకు వెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై విరిజట్లు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular