Homeక్రీడలుCSK vs RCB : ఏమన్నా ఫీల్డింగ్ నా.. రహానే ఫీట్ కు బెంగళూరు బెంబేలు...

CSK vs RCB : ఏమన్నా ఫీల్డింగ్ నా.. రహానే ఫీట్ కు బెంగళూరు బెంబేలు అంతే.. వైరల్ వీడియో

Chennai Super Kings Vs Royal Challengers
Chennai Super Kings Vs Royal Challengers

Chennai Super Kings Vs Royal Challengers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి ఏటా హాట్ ఫేవరెట్ గా బరిలో దిగే జట్లలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఒకటి. ఈ జట్టులోని ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదవలేదు.. ప్రతి జట్టును మట్టి కరిపించగల సామర్థ్యం వీరి సొంతం. అయినా ఈ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. ఈ జట్టులో ఆర్సీబీ ఓడిపోవడానికి బ్యాటింగ్ వైఫల్యమే కాకుండా.. చెన్నై జట్టులోని రహానే అద్భుతమైన ఫీలింగ్ కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

బెంగళూరు చాలెంజర్స్ జట్టుకు ఐపీఎల్ లో మరో ఓటమి ఎదురయింది. సులభంగా విజయం సాధించాల్సిన మ్యాచ్ లో.. బెంగళూరు జట్టు చివరిలో తడబడి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. బెంగళూరు జట్టు బ్యాటింగ్ వైఫల్యంతోపాటు.. చెన్నై జట్టు అద్భుతమైన ఫీల్డింగ్ ఆర్సీబీ ఓటమికి కారణమైంది. ఒకానొక దశలో సులభంగా మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధిస్తుందన్న స్థితి నుంచి.. ఓటమి మూటగట్టుకోవాల్సిన స్థితికి బెంగళూరు జట్టు పడిపోయింది.

భారీ లక్ష్యం.. దాటిగానే ఆరంభించిన బెంగుళూరు..

చెన్నై వేదికగా బెంగళూరు చెన్నై జట్ల మధ్య సోమవారం సాయంత్రం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఆరు వికెట్ల నష్టపోయి 226 పరుగులు చేసింది. డేవాన్ కాన్వాయ్ 45 బంతుల్లో 83 పరుగులు, అజంక్య రహనే 20 బంతుల్లో 37 పరుగులు, శివం దూబే 27 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించి పెట్టారు. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. ధాటిగానే బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులు, గ్లెన్ మ్యాక్స్వెల్ 36 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో బెంగళూరు జట్టు ఎనిమిది పరుగులు తేడాతో ఓటమి పాలైంది.

Chennai Super Kings Vs Royal Challengers
Chennai Super Kings Vs Royal Challengers

అద్భుతమైన ఫీలింగ్ తో అదరగొట్టిన రహానే..

బెంగుళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు పేలవ ఫీల్డింగ్ కొంపముంచే స్థితికి తీసుకెళ్ళింది. ఈ మ్యాచ్ లో మూడు కీలక క్యాచ్ లను చెన్నై ఫీల్డర్లు నేలపాలు చేశారు. అయితే వీళ్ళందరి కంటే భిన్నంగా తాను మాత్రం సూపర్ మాన్ లా ఫీల్డింగ్ చేశాడు వెటరన్ ప్లేయర్ రహనే. మినీ వేలంలో ఎవరూ కొనకపోతే చివరకు బేస్ ధర రూ.50 లక్షలకే అతని చెన్నై కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్ లో మాక్స్ వెల్ కొట్టిన ఒక భారీ షాట్ ఖచ్చితంగా సిక్స్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రహానే మాత్రం దాన్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే గాల్లోకి ఎగిరి మరీ ఆ బంతిని క్యాచ్ పట్టేసాడు. అయితే, దాని చేతిలో ఉంచుకుంటే సిక్స్ అవుతుందని అతనికి కూడా తెలుసు. అందుకే బౌండరీ రోప్ మీద పడే ముందు బంతిని మైదానంలోకి విసిరాడు. దీంతో సిక్సు వెళ్లాల్సిన ఆ బంతికి కేవలం సింగిల్ వచ్చింది. అలాగే ఆ తర్వాత కూడా సూపర్ ఫీల్డింగ్ తో రెండు మూడు బౌండరీలను రహానే అడ్డుకున్నాడు. అతని ఫీల్డింగ్ చూసిన మిగతా చెన్నై ఫీల్డర్లు కూడా తమ పొరపాట్లు సరి చేసుకుని చక్కగా ఫీల్డింగ్ చేయడం మొదలుపెట్టారు. దేనికి తోడు తనదైన స్టైల్ లో వ్యూహాల రచించి మ్యాక్స్వెల్, డూప్లెసెస్ ఇద్దరినీ అవుట్ చేసేలా చేశాడు ధోని. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో బెంగళూరు జట్టు విజయానికి దగ్గర వరకు వచ్చి ఓటమి పాలయింది.

RELATED ARTICLES

Most Popular