Rocking Rakesh- Jordar Sujatha: బుల్లితెర సాక్షిగా చాలా ప్రేమకథలు ప్రాణం పోసుకుంటాయి. రష్మీ-సుడిగాలి సుధీర్, ఇమ్మానియేల్-వర్ష జబర్దస్త్ ప్రేమజంటలుగా అవతరించారు. అయితే వీరు ఉత్తుత్తి ప్రేమికులా నిజమైన ప్రేమికులా అనే విషయంలో క్లారిటీ లేదు. కాగా జబర్దస్త్ షో ద్వారా కలిసిన మరో జంట ఉన్నారు. వారు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఓ షోలో వేలికి రింగ్ తొడిగి సుజాతకు రాకేష్ ప్రపోజ్ చేశారు. మిగతా ప్రేమికుల లాగా వీరు కూడా ప్రేక్షకులను అలా భ్రమింపజేస్తున్నారని అందరూ భావించారు. అయితే వాళ్ళది సీరియస్ లవ్ స్టోరీ అని తర్వాత తెలిసింది.

పెళ్ళికి సిద్ధమైన ఈ జంట ఒకే ఇంట్లో ఉంటున్నారట. సుజాతతో పెళ్లి విషయంపై రాకేష్ తల్లిగారు స్వయంగా స్పందించారు. రాకేష్ మదర్ విజయలక్ష్మి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. విజయలక్ష్మి కాబోయే కోడలు సుజాతపై ప్రశంసలు కురిపించారు. తమ ఇంటిలోని మరో చిన్న పిల్లగా ఆమెను పోల్చారు. సుజాత మా ఇంటికి వచ్చాక సందడి నెలకొంది. మా చిన్నబ్బాయి కూతురుతో పాటు సుజాత మరో చిన్నారి అయ్యింది. సుజాత మంచి అమ్మాయి. అల్లరి చేస్తూ గలగలా మాట్లాడుతుంది.
రాకేష్ అసలు వివాహం చేసుకోను అన్నాడు. అది నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బంధువులు సన్నిహితులు రాకేష్ వివాహం గురించి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక బాధేసేది. రాకేష్ మనసు మారాలని ఎన్నో పూజలు చేశాను. అదృష్టం కొద్దీ రాకేష్ జీవితంలోకి సుజాత వచ్చింది. వారిద్దరికీ భగవంతుడు రాసి పెట్టాడు, అని విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.

సుజాతను ప్రేమిస్తున్న విషయం మీకు ముందే చెప్పాడా? లేక మీరు కూడా మాలాగే టీవీలో ప్రపోజ్ చేయడం చూసి తెలుసుకున్నారా? అని అడగ్గా… రాకేష్ నాకు ముందే చెప్పాడు. పెళ్లి చేసుకోకపోతే నేను ఇంట్లో నుండి వెళ్లిపోతానని బెదిరించాను. అప్పుడు సుజాతను ప్రేమిస్తున్న విషయం చెప్పాడని విజయలక్ష్మి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాకేష్-సుజాతల వివాహం త్వరలో జరగనుంది. అయితే సుజాత రాకేష్ కుటుంబ సభ్యులతోనే ఉంటున్నారని సమాచారం. జోర్దార్ షో ద్వారా ఫేమస్ అయిన సుజాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు.