Rocking Rakesh- Jordar Sujatha: జబర్దస్త్ వేదిక మీద పురుడుపోసుకున్న ప్రేమ కథ పెళ్ళికి దారితీసింది. మాది ఉత్తిత్తి ప్రేమ కాదని రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత నిరూపించారు. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్, వర్ష- ఇమ్మానియేల్ జబర్దస్త్ లవ్ బర్డ్స్ గా ఫేమస్ అయ్యారు. అయితే వారి ప్రేమలో సీరియస్నెస్ లేదు. కేవలం కెరీర్ కోసం వేసే డ్రామాలు మాత్రమే. ప్రేక్షకుల్లో హైప్ తెచ్చుకోవడానికి కృత్రిమ ప్రేమ కురిపిస్తారు. జోర్దార్ సుజాతపై రాకింగ్ రాకేష్ ప్రేమ కూడా అలాంటిదే అనుకున్నారందరూ. కాదని నిరూపించారు ఈ జంట. జోర్దార్ సుజాత జబర్దస్త్ లోకి వచ్చాక రాకింగ్ రాకేష్ తో పరిచయమైంది. వారి పరిచయం ప్రేమకు దారి తీసింది.

నేడు ఈ జంట ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. సుజాత-రాకేష్ ల ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి జబర్దస్త్ కమెడియన్స్ హాజరయ్యారు. స్టార్ యాంకర్ అనసూయ, రవితో పాటు పలువురు హాజరయ్యారు. మంత్రి రోజా హాజరుకావడం అరుదైన విషయం. రోజాకు రాకేష్ అంటే ప్రత్యేక అభిమానం. ఇటీవల సుజాత-రాకేష్ రోజా ఇంటికి వెళ్లారు. కొత్త జంటను స్వయంగా తిరుమల తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించింది. సుజాతకు పట్టుచీర, తాంబూలంతో సారె పెట్టింది.
నేడు ఎంగేజ్మెంట్ కి కూడా రోజా హాజరయ్యారు. ప్రత్యేకంగా రూపొందించిన బట్టల్లో రాకేష్-సుజాత జంట మెరిసిపోయారు. సోషల్ మీడియాలో ఈ కాబోయే దంపతుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కలకాలం ఈ జబర్దస్త్ ప్రేమికులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక్కటయ్యేందుకు సిద్ధమైన రాకేష్-సుజాత చాలా కాలంగా కలిసి ఉంటుంది. రాకేష్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడే సుజాత ఉంటున్నారు.

ఇక సుజాత విషయంలో రాకేష్ తల్లి చాలా సంతోషంగా ఉన్నారు. రాకేష్ అసలు వివాహం చేసుకోను అన్నారట. జీవితంలో పెళ్లి చేసుకోనన్న రాకేష్ మనసు మార్చి తన జీవిత భాగస్వామి గా మారిన సుజాతపై ఆమె పొగడ్తలు కురిపిస్తున్నారు. మా కుటుంబంలో కలిసిపోయిన సుజాత చిన్న పిల్ల మాదిరి అల్లరి చేస్తూ ఇంటిని సందడిగా మార్చేసిందంటూ రాకేష్ తల్లిగారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఎంగేజ్మెంట్ జరుపుకున్న నేపథ్యంలో త్వరలో రాకేష్-సుజాత పెళ్లి పీటలెక్కనున్నారు. జోర్దార్ వార్తలతో పేరు తెచ్చుకున్న సుజాత బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నారు. ఆమె త్వరగా ఎలిమినేటైనప్పటికీ గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీ ఆమెకు బుల్లితెర మీద బిజీ అయ్యేలా చేసింది.