Homeజాతీయ వార్తలుModi- DRDO: దేశ సైనిక పాఠవం కోసం మోడీ చేసిన అతిపెద్ద మార్పు ఇదే.. సలాం...

Modi- DRDO: దేశ సైనిక పాఠవం కోసం మోడీ చేసిన అతిపెద్ద మార్పు ఇదే.. సలాం చేయాల్సిందే!

Modi- DRDO: డీఆర్డీవో… డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌.. భారత సైన్యానికి ఆయుధాలు తయారు చేసే ప్రభుత్వరంగ సంస్థ. ఇది మోదీ వచ్చిన తర్వాత ఏర్పడిన సంస్థ కాదు. దాదాపు 60 ఏళ్లుగా పనిచేస్తోంది. కానీ, మోదీ వచ్చిన తర్వాత ఈ సంస్థ శక్తివంతంగా మారింది. సైన్యానికి వెన్నెముక అయిన ఈ సంస్థ గతంలో పాలకుల తీరుతో చతికిలపడింది. రక్షణ రంగం కన్నా.. రాజకీయాలు, వ్యక్తిగత అవసరాలు, కమీషన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ తొమ్మిదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చలికిలబడిన డీఆర్డీవో శక్తివంతంగా తయారైంది. శత్రుదేశాల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇది ఒక్క రోజులు జరుగలేదు. దీనివెనుక ప్రధాని నరేంద్రమోదీ సుదీర్ఘ కసరత్తు, కృషి ఉంది.

Modi- DRDO
Modi- DRDO

అత్యాధునిక ఆయుధాల ఆవిష్కరణ..
దేశంలోని త్రివిద దళాలకు దేశీయంగా ఆయుధాలు తయారుచేసే సంస్థ డీఆర్డీవో. ప్రారంభంలో అనేక ఆయుధాలను సైన్యానికి అందించింది. తర్వాత రాజకీయ జోక్యం, అధికారుల అలసత్వంతో పూర్తిగా నీర్వీర్యమైంది. ఆధునిక డెవలప్‌మెంట్స్, అత్యాధునిక ఆయుధాల తయారీపై పెద్దగా దృష్టిపెట్టలేదు. నిధులు కూడా ప్రభుత్వాలు అడిగినంత ఇవ్వలేదు. 2014 ముందు వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.

మోదీ రాకతో మారిన పరిస్థితి..
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక డీఆర్డీవోకు మంచిరోజులు వచ్చాయి. 2016 వరకు మోదీ శత్రుదేశాలతోనూ మిత్రత్వమే కోరుకున్నారు. కానీ, 2016లో సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ చేసిన దాడి మోదీని షాక్‌కు గురిచేసింది. పాకిస్తాన్‌ను దెబ్బకొట్టాలంటే మన ఆయుధరంగాన్ని ఆధునికీకరించాలని భావించారు. ఈ క్రమంలోనే డీఆర్డీవోను శక్తివంతం చేసే ప్రక్రియ ప్రారంభించారు. అందులో పనిచేసే అసమర్థ అధికారులను క్రమంగా తప్పించారు. జాతీయ భావం దేశరక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని నియమించారు. డీఆర్డీవో అడిగినన్ని నిధులు సమకూర్చారు. తమకు కావాల్సిందల్లా దేశ రక్షణ అని భావించారు. ఈ క్రమంలో మోదీ ఇచ్చిన స్వేచ్ఛతో డీఆర్డీవో శక్తివంతమైంది. అత్యాధునిక డ్రోన్లతోపాటు పక్షులను కూడా ఆయుధాలుగా మలిచింది. దేశీయంగా అనేక అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. అగ్ని, పృథ్వీ కిపుణులను మరింత శక్తివంతంగా మార్చింది. ఇదే సమయంలో మోదీ రష్యా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేశారు.

Modi- DRDO
Modi- DRDO

అదే సైన్యం శత్రువులను తిప్పి కొడుతోంది..
డీఆర్డీవో అందిస్తున్న అత్యాధునిక ఆయుధాలతో త్రివిధ దళాలు ఇప్పుడు శత్రుమూకలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. చైనా భారత్‌ భూభాగాన్ని అక్రిమించేందుకు యత్నించిన మూడు ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. పాకిస్తాన్‌ బాలాకోట్‌పై చేసిన దాడని సమర్థవంతంగా తిప్పికొట్టింది. రెండుసార్లు మనసైన్యం పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయకలిగింది. భారత్‌తో కుద్ధం చేయాలంటే బయపడేలా చేసింది మన సైన్యం. దీనివెనుక డీఆర్డీవో కృషిని విస్మరించలేం. గతంలో ఉన్న సైన్యమే నేడు అద్భుతాలు చేయడానికి సైన్యానికి డీఆర్డీవో వెన్నెమెకగా నిలవడమే. తాజాగా ఎలుకలనూ డీఆర్డీవో ఆయుధాలుగా మలిచే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే ఈ ఆయుధాలు సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular