https://oktelugu.com/

Roar of Veera Simha Reddy : వీరసింహారెడ్డి నుండి న్యూ ఇయర్ గిఫ్ట్… అంచనాలు పెంచేసిన వీడియో..!

Roar of Veera Simha Reddy : సంక్రాంతి చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్కో ప్రమోషనల్ వీడియో ఆడియన్స్ లో ఆసక్తి పెంచేస్తున్నాయి. పోటీ భారీగా ఉన్న నేపథ్యంలో ఎవరూ తగ్గడం లేదు. ఓపెనింగ్ డే గట్టిగా కొట్టేందుకు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఇక సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో బరిలో దిగుతున్నారు. వీరసింహారెడ్డి లుక్స్, పోస్టర్స్, ప్రోమోలు ఆయన గత ఇండస్ట్రీ హిట్స్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు […]

Written By: , Updated On : December 31, 2022 / 04:53 PM IST
Follow us on

Roar of Veera Simha Reddy : సంక్రాంతి చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్కో ప్రమోషనల్ వీడియో ఆడియన్స్ లో ఆసక్తి పెంచేస్తున్నాయి. పోటీ భారీగా ఉన్న నేపథ్యంలో ఎవరూ తగ్గడం లేదు. ఓపెనింగ్ డే గట్టిగా కొట్టేందుకు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఇక సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో బరిలో దిగుతున్నారు. వీరసింహారెడ్డి లుక్స్, పోస్టర్స్, ప్రోమోలు ఆయన గత ఇండస్ట్రీ హిట్స్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలను తలపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి మూవీతో బాలకృష్ణ భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు.

ఇక న్యూ ఇయర్ పురస్కరించుకొని వీరసింహారెడ్డి మూవీ నుండి మేకింగ్ వీడియో విడుదల చేశారు.మేకింగ్ వీడియోలో… ఊరి ప్రజల్లో బాలకృష్ణ వైభవం, రాజసం, శత్రువులను చెండాడుతున్న పరాక్రమం కనిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి గా సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య వీర విహారం చేయడం అనివార్యమే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన లుక్, గెటప్స్ గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి. వందల మందిని ఒంటి చేత్తో నరికే బాలకృష్ణ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ సమాహారంగా మూవీ తెరకెక్కిందని మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది.

ఇక విడుదలైన మూడు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా వీరసింహారెడ్డి మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. యూఎస్ లో బుకింగ్స్ మొదలు కాగా బాలయ్య జోరు చూపిస్తున్నారు. ఓపెనింగ్ డే వీరసింహారెడ్డి బాలయ్య గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా… థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ధునియా విజయ్ విలన్ రోల్ చేశారు.

జనవరి 12న వీరసింహారెడ్డి విడుదల కానుంది. ఆ నెక్స్ట్ డే 13న వాల్తేరు వీరయ్య థియేటర్స్ లోకి రానుంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో పాటు విజయ్ వారసుడు పోటీపడుతోంది. అలాగే అజిత్ తునివు సైతం సంక్రాంతికి విడుదల అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తునివు విడుదల చేస్తున్నారా? లేదా? అనేది స్పష్టం కాలేదు. వారసుడు, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు మాత్రం అధికారికంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్ పంపకాల విషయంలో వివాదాలు నడుస్తున్నాయి.

Roar of Veera Simha Reddy - The Making Video | Nandamuri Balakrishna | Gopichand Malineni | Thaman S