Bigg Boss 6 Telugu RJ Surya: ఆర్జే సూర్య.. టీవీ9లో రోజూ రాత్రి వచ్చే ‘ఇస్మార్ట్ న్యూస్’లలో మిమిక్రీ చేస్తూ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ‘విజయ్ దేవరకొండ’ గొంతును యాజ్ టీజ్ దింపేసి ఆకట్టుకునేవాడు. టీవీ9 నుంచి బిగ్ బాస్ లోకి ఆఫర్ రాగానే వెళ్లిపోయాడు. టీవీ9 లో ఎలాగైతే కామెడీ చేస్తున్నాడు. బిగ్ బాస్ లో అంతకుమించి రోమాన్స్ కూడా చేస్తున్నాడు.

ఇస్మార్ట్ న్యూస్ లోనే తనతోపాటు చేసే యాంకర్ ఆరోహిరావు కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.వీరిద్దరికీ బయటే పరిచయం అనుకున్నారంతా.. కానీ అంతకుమించిన ప్రేమ ఉందని బిగ్ బాస్ లోనే బయటపడింది. తాజా ఎపిసోడ్ లో హగ్ కావాలని.. ఒక ముద్దు కావాలని సూర్యను ఆరోహి అడుక్కుంటున్న ప్రోమోలు వైరల్ అయ్యాయి.
ఇక నిన్న ఇచ్చిన ‘హోటల్ ’ టాస్క్ లో ఆర్జే సూర్య రెచ్చిపోయాడు. వింత వింత క్యారెక్టర్లు చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో ‘గే’ గెటప్ వేసి సూర్య రచ్చ చేశాడు. అమ్మాయిల డ్రెస్ వేసుకొని గే లా నడుస్తూ వ్యవహరిస్తూ గార్డెన్ ఏరియాలో పాటకు డ్యాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేశాడు. అచ్చం గే లా మారిపోయిన సూర్యను చూసి అభిమానులు మెంటలెక్కిపోయారు.
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ‘గజినీ’లా మారిపోయిన సూర్య బట్టలిప్పి ఒళ్లంతా పేర్లతో రాసుకొని అరాచకం సృష్టించాడు. ఈరోజు రాత్రి సూర్య మరింతగా పర్ ఫామెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి సూర్య చేసే రచ్చను చూడాలంటే ఈరోజు రాత్రి ఎపిసోడ్ ను మనం మిస్ కావద్దు అంతే!
[…] […]