Rishab Shetty- Rashmika Mandanna: రష్మిక మందాన-రిషబ్ శెట్టి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా రష్మికపై ఆయనకు కోపం తగ్గలేదనడానికి తాజా సంఘటన నిదర్శనం. రిషబ్ శెట్టి ట్వీట్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. కెరీర్ ఇచ్చిన కన్నడ పరిశ్రమపై రష్మికకు గౌరవం లేదు అనేది కన్నడిగుల ప్రధాన ఆరోపణ. ఇటీవల రెండు ముందు సందర్భాల్లో రష్మిక స్పందించిన తీరుకు వారి మనోభావాలు దెబ్బతీశాయి. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. 2016లో విడుదలైన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి హీరో, రిషబ్ శెట్టి దర్శకుడు. పరమవాహ్ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ రష్మిక నిర్మాత సంస్థ పేరు ప్రస్తావించలేదు.

అనంతరం కాంతార చిత్రం చూశారా అని అడగ్గా… చూడలేదు అని పొగరు సమాధానం చెప్పింది. రష్మిక సమాధానానికి మండిపడ్డ కన్నడ వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేశారు. రిషబ్ శెట్టి సైతం పరోక్షంగా ఆమెకు చురకలు అంటించారు. రష్మికను ఉద్దేశిస్తూ అలాంటి హీరోయిన్స్ తో మూవీ చేయను, నటించను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నడ పరిశ్రమ వర్గాలు రష్మికను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రష్మిక ఖండించారు.
మీడియా నన్ను అడిగినప్పటికి కాంతార చిత్రం చూడలేదు. అందుకే అలా సమాధానం చెప్పాను. తర్వాత మూవీ చూసి చిత్ర యూనిట్ కి ఫోన్ చేసి బెస్ట్ విషెస్ తెలియజేశాను. అభినందించాను. కన్నడ పరిశ్రమ నన్ను బ్యాన్ చేయబోతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాకు వారితో విబేధాలు లేవని రష్మిక క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమె మాటల్లో నిజం లేదని రష్మిక విషయంలో కాంతార హీరో రగిలిపోతున్నట్లు తాజా ఘటనతో బయటపడింది.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన కిరాక్ పార్టీ విడుదలై 6 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. కిరాక్ పార్టీ విడుదలై నేటికి ఆరేళ్ళు. థియేటర్స్ లో మీ ఈలలు, కేకలు ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఆ రోజుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాము… అంటూ కామెంట్ చేశారు. తన ట్వీట్ లో హీరో రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ, మ్యూజిక్ డైరెక్టర్స్ ని ట్యాగ్ చేసిన రిషబ్… రష్మిక మందానను పేరు ప్రస్తావించలేదు. కావాలనే ఆయన రష్మికను ట్యాగ్ చేయలేదని ఇక్కడ స్పష్టం అవుతుంది.

ఈ క్రమంలో కాంతార యూనిట్ తో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను అని రష్మిక చెప్పిన మాటల్లో నిజం లేదా? ఒక వేళ రష్మిక వారితో మాట్లాడినా కోపం తగ్గలేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. రష్మిక మీద రిషబ్ శెట్టికి అసహనం అలానే ఉందన్నది మాత్రం నిజం. కాగా కిరిక్ పార్టీ మూవీ షూటింగ్ టైంలో రక్షిత్ ని ఆమె ప్రేమించారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రష్మిక రక్షిత్ శెట్టి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. రష్మిక కన్నడ పరిశ్రమను వదిలేయడానికి బీజం అక్కడే పడింది.