Rishabh Pant: జట్టుపరంగా లక్నో ప్రయాణం కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. రిషబ్ పంత్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆడలేక పోతున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో 0, రెండో మ్యాచ్లో 15, తదుపరి మ్యాచ్లలో 2, 2 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 4.75 గా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తో జరిగిన తొలి మ్యాచ్లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విక్టరీస్ సొంతం చేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో విజయ పతాక ఎగరవేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
Also Read: గుజరాత్ విజయ ప్రస్థానం వెనుక ఇద్దరు తమిళ ‘‘సాయి’’లు!
27 కోట్లు పెట్టి కొన్నది ఇందుకా?
ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది.. మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో జట్టులో మార్ష్(81), పూరన్(87), మార్క్రం(47) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆ తర్వాత 239 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల రాష్ట్రానికి 234 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో అత్యంత కీలకమైన సునీల్ నరైన్ వికెట్ ను లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ రాటి పడగొట్టాడు. అతడు అవుట్ కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ తడబాటుకు గురైంది. అయితే ఈ మ్యాచ్లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య లక్నో గెలిచింది. అయితే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారం దిగ్వేష్ రాటికి లభించింది. ఈ మ్యాచ్ అనంతరం పురస్కారం అందిస్తున్న సమయంలో.. దిగ్వేష్ రాటికి ఎలాంటి అనుభవం ఎదురయిందో.. తెలుసుకోవడానికి వ్యాఖ్యాత ప్రయత్నించారు. అయితే అతను వెస్టిండీస్ దేశానికి చెందినవాడు కావడంతో.. ఇంగ్లీష్ తప్ప మరో భాష మాట్లాడలేదు. ఇంగ్లీషులోనే దిగ్వేష్ రాటిని ప్రశ్నలు అడిగాడు. అయితే అతడికి ట్రాన్స్లేటర్ గా రిషబ్ పంత్ వ్యవహరించాడు. అయితే ఇప్పుడు ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ ను కొనుగోలు చేస్తే.. గొప్పగా ఆడ లేకపోయినప్పటికీ .. చివరికి జట్టుకు ఇలాగైనా ఉపయోగపడుతున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసేదానికంటే.. ఉండవల్లి అరుణ్ కుమార్ ను పెట్టుకొని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై రిషబ్ పంత్ అభిమానులు మండిపడుతున్నారు.గడచిన సీజన్ కు సంబంధించిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఒంటి చేత్తో రిషబ్ పంత్ టీమిండియా కు అందించిన విషయాన్ని మర్చిపోవద్దని వారు హితవు పలుకుతున్నారు. ఇంగ్లీష్ భాష రాకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని.. మరికొందరు పేర్కొంటున్నారు. మైదానంలో ఆటగాళ్లకు ప్రతిభ ముఖ్యమని వివరిస్తున్నారు.