Pushpa 2: అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది పుష్ప 2. మూడేళ్ళ క్రితం 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. దాదాపు రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారని సమాచారం. వరల్డ్ వైడ్ ఆరు భాషల్లో, 12000 లకు పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప 2 అతిపెద్ద రిలీజ్. ఈ మూవీ విడుదలకు ముందే లాభాలు పంచింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 1000 కోట్లు నిర్మాతలు ఆర్జించారు.
లాభాల్లో వాటా పారితోషికంగా తీసుకున్న అల్లు అర్జున్ ఈ చిత్రానికి ఏకంగా రూ. 300 కోట్లు తీసుకున్నారని టాలీవుడ్ టాక్. పుష్ప 2 టికెట్స్ ధరలు అధికంగా ఉన్నాయి. అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఫస్ట్ డే పుష్ప 2 అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ రూ. 250 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కలదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక పుష్ప 2 విజయం సాధించాలని టాలీవుడ్ ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు. కాగా మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ మొదటగా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా పుష్ప 2 టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ”పుష్ప 2 చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను..” అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందాన, సుకుమార్ తో పాటు నటులను, నిర్మాతలను ట్యాగ్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్ అవుతుంది.
కాగా డిసెంబర్ 4 అర్థరాత్రి నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల ప్రదర్శన ఉంది. ఎటూ యూఎస్ లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ పడతాయి. మొదటిరోజే 20 శాతానికి పైగా బిజినెస్ రికవరీ చేయాలనేది పుష్ప 2 నిర్మాతల ప్లాన్. వీకెండ్ కల్లా మూవీ బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడుతుందని భావిస్తున్నారు. గురువారం ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. మరో మూడు రెండు వారాల్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. అవి కలిసొస్తాయి.
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. జగపతిబాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక రోల్స్ చేశారు.
Wishing all the best to the entire team of #Pushpa2TheRule.
Sending my heartfelt and blockbuster wishes to @alluarjun #Bunny , @aryasukku sir, #FahadhFaasil, @ThisIsDSP , @iamRashmika @resulp @SukumarWritings , @MythriOfficial , and the entire team. pic.twitter.com/VMUb4GLvuu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2024