RGV Mark: ఆర్జీవీ ‘మార్క్’ పండుగ శుభాకాంక్షలు.. ఇలానే ఉంటది మరీ..!

RGV Mark: వివాదాలతో సావాసం చేసే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాంగోపాల్ వర్మే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజంలోని వివాదాలనే సినిమాలుగా తెరకెక్కిస్తూ ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవడం వర్మను మించిన వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు. భోగి పండుగ సందర్భంగా ఆర్జీవీ తన స్టైల్ కు భిన్నంగా ట్వీటర్లో అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరినీ విస్మయానికి గురిచేశారు. రాంగోపాల్ వర్మకు రోటిన్ గా చెప్పుకునే హాయ్.. బాయ్.. గుడ్ మార్మింగ్.. తిన్నారా..? ఏం చేస్తున్నారు..? […]

Written By: Raghava Rao Gara, Updated On : January 14, 2022 5:50 pm
Follow us on

RGV Mark: వివాదాలతో సావాసం చేసే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాంగోపాల్ వర్మే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజంలోని వివాదాలనే సినిమాలుగా తెరకెక్కిస్తూ ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవడం వర్మను మించిన వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు. భోగి పండుగ సందర్భంగా ఆర్జీవీ తన స్టైల్ కు భిన్నంగా ట్వీటర్లో అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరినీ విస్మయానికి గురిచేశారు.

Ram Gopal Varma

రాంగోపాల్ వర్మకు రోటిన్ గా చెప్పుకునే హాయ్.. బాయ్.. గుడ్ మార్మింగ్.. తిన్నారా..? ఏం చేస్తున్నారు..? వంటివి అడిగితే పరమ చికాకు. ఎవరైనా ఆయనకు ఇలాంటి చెప్పినా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా అడిగిన తనదైన శైలిలో ఆర్జీవీ సైటర్లు వేస్తుంటారు. ముఖ్యంగా తనతో ఇంటర్వ్యూలు చేసి యాంకర్ల విషయంలో ఇలాంటివి ఆర్జీవీకి తరుచూ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు ఆర్జీవీ విషయంలో కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ఉన్నాయి.

దీంతో ఇటీవలీ కాలంలో ఆర్జీవీ విషయంలో యాంకర్ల రోటిన్ పలుకరింపులు చాలావరకు తగ్గిపోయాయి. అయితే ఆర్జీవీ మాత్రం గత కొద్దిరోజులుగా తన స్టైల్ కు భిన్నంగా వ్యవహరిస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తుండటం గమనార్హం. గత సంవత్సరం దీపావళి రోజున ఆర్జీవీ తన కుటుంబ సభ్యులను కలిసి సెలబ్రేషన్స్ చేసుకొని అందరినీ సర్ ప్రైజ్ చేశారు.

రాంగోపాల్ వర్మ తన అమ్మ, అక్కలతో కలిసి బాణాసంచా కాల్చడం అప్పట్లో వైరల్ అయింది. తాజాగా తన అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తనదైన స్టైల్లో చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక చివర్లో ఆర్జీవీ అదిరిపోయే ట్వీస్ట్ ఇవ్వడం కొసమెరుపు. ఇంతకీ ఆయన తన ట్వీటర్లో ఏం ట్వీట్ చేశాడో ఒకసారి చూద్దాం..!

‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. మీకు అంబానీని మించిన ఇల్లు.. డబ్బు రావాలి.. మీకు ఇప్పుడు, ఎప్పుడూ ఎలాంటి వైరస్‌ సోకకూడదు.. అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి.. భర్తలను భార్యలు వేధించకూడదు.. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి.. చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్‌ కావాలి నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి.. అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ట్వీట్లకు ఆయన ఫ్యాన్స్ సైతం తమదైన శైలిలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.