Hero Movie: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఆశీస్సులతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ‘హీరో’ మూవీతోనే గల్లా అశోక్ హీరోగా పరిచయం కానుండటం విశేషం. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘హీరో’ మూవీపై తన స్పందనను ట్వీటర్లో వెల్లడించారు.

‘హీరో’ మూవీని తాను చూశానని.. తనకు ఎంతో బాగా నచ్చిందని మహేష్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గల్లా అశోక్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చిత్రబృందానికి ముందస్తుగానే కంగ్రాట్స్ చెప్పారు. అశోక్ సినిమాల కోసం గత ఐదారేళ్లుగా కష్టపడుతున్నాడని అతడి హర్డ్ వర్క్ విజయం తెచ్చిపెడుతుందన్నారు.
ఆ రోజుల్లో సంక్రాంతి పండుగ కృష్ణగారికి బాగా కలిసొచ్చిందన్నారు. ఆ తర్వాత ఆ సెంటిమెంట్ తనకు కూడా కలిసి వచ్చిందని తెలిపారు. సంక్రాంతికి రిలీజైన తన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని మహేష్ బాబు గుర్తు చేశారు. 2022 సంక్రాంతికి వస్తున్న ‘హీరో’ కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.
ఈ సంక్రాంతికి తమ ఫ్యామిలీ నుంచి వస్తున్న అశోక్ కు తన అభిమానుల సపోర్టు ఉంటుందని తెలిపారు. ‘హీరో’ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఓ వీడియో సందేహాన్ని ఆయన ట్వీటర్లో పోస్టు చేశారు. ఇక ఈ మూవీలో గల్లా అశోక్ సరసన బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది.
Superstar @urstrulyMahesh watched #HERO🌟movie and loved it a lot 👍
He showered all his best wishes & praises on @AshokGalla_ for his Debut . Wishes the entire team a very All the best for the Release tmrw🔥#HEROfromTomorrow 😎@SriramAdittya @AgerwalNidhhi @amararajaent pic.twitter.com/h4WvGLsWYV
— Amara Raja Media and Entertainment Pvt Ltd (@amararajaent) January 14, 2022