Nellore District: పనిమనిషిని తమ మనిషిగా భావించి అంత్యక్రియలు.. ఆ కుటుంబానికి హాట్సాఫ్

విష్ణువర్ధన్ రెడ్డి ది నెల్లూరులోని అల్లూరు. 30 సంవత్సరాల కిందట లక్ష్మమ్మ అనే గిరిజన అనాధ మహిళ పని కోసం విష్ణువర్ధన్ రెడ్డిని ఆశ్రయించింది. దీంతో ఆమెను పనిమనిషిగా చేర్చుకున్నారు.

Written By: Dharma, Updated On : August 9, 2023 10:54 am

Nellore District

Follow us on

Nellore District: సొంత మనుషులనే పరాయి వాళ్ళుగా చూస్తున్న రోజులు ఇవి. వృద్ధాప్యంలో భారం అవుతున్నారని భావించి తల్లిదండ్రులను అనాధాశ్రమంలో చేర్పించే పిల్లలు ఉన్నారు. అటువంటిది ఓ గిరిజన మహిళను సొంత మనిషిగా భావించారు. మూడు దశాబ్దాలుగా తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. కుటుంబ సభ్యురాలు గానే చూసుకున్నారు. ఇప్పుడు అనారోగ్యంతో ఆమె మృతి చెందడంతో… సొంత కుటుంబ సభ్యురాలు మాదిరిగానే భావించి అంత్యక్రియలుచేశారు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

విష్ణువర్ధన్ రెడ్డి ది నెల్లూరులోని అల్లూరు. 30 సంవత్సరాల కిందట లక్ష్మమ్మ అనే గిరిజన అనాధ మహిళ పని కోసం విష్ణువర్ధన్ రెడ్డిని ఆశ్రయించింది. దీంతో ఆమెను పనిమనిషిగా చేర్చుకున్నారు. అప్పటినుంచి ఆమె ఆ ఇంట్లో పని చేస్తోంది. కానీ విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం మాత్రం ఆమెను సొంత మనిషి గానే చూసుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా లక్ష్మమ్మ సోమవారం రాత్రి మృతి చెందింది. అప్పటికి హైదరాబాదులో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు హుటాహుటిన అల్లూరు కి చేరుకున్నారు.

లక్ష్మమ్మకు నా అనే వారు లేకపోవడంతో.. విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ నివాసం వద్దే లక్ష్మమ్మ మృతదేహానికి ఎమ్మెల్యే సతీమణి శివప్రియ స్వయంగా పసుపు రాశారు. ఆఖరి స్నానం చేయించారు. కన్నీటితో వీడ్కోలు పలికారు. కాగా పని మనిషిని తమ మనిషిగా భావించి అంత్యక్రియలు చేయడం స్ఫూర్తిదాయకమని విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.