Bigg Boss 6 Telugu Winner Revanth: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతీ కంటెస్టెంట్ టైటిల్ కొట్టాలనే అనుకుంటాడు..అందుకోసం ఎన్నెన్నో చెప్తారు..కానీ చెప్పిన మాట మీద నిలబడడం చాలా కష్టం..ఎందుకంటే హౌస్ లో జరిగే పరిణామాలు మన చేతుల్లో ఉండవు కాబట్టి..కానీ రేవంత్ మాత్రం తాను చెప్పిన మాట మీద నిలబడ్డాడు..మొదటి రోజు నుండి నేటి వరకు ట్రోఫీ గెలవడమే లక్ష్యం గా పెట్టుకున్నాడు..ఆ లక్ష్యానికి చేరుకోవాలనే కసి రేవంత్ తన ప్రతీ టాస్కులో చూపించాడు.

కంటెస్టెంట్ అంటే ఇలాగే కదరా ఉండాలి అని అనిపించే రేంజ్ లో ఆయన నిలిచాడు..తనకి కోపస్వభావం ఉన్నప్పటికీ హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ తో స్నేహపూర్వకంగా ఉన్న వ్యక్తి రేవంత్ ఒక్కడే..తన బిగ్ బాస్ జర్నీ లో శ్రీహాన్ మరియు శ్రీ సత్య బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యినప్పటికీ కూడా అందరితో బాండింగ్ బాగా మెయింటేన్ చేసాడు..అందుకే రేవంత్ కి అంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఈ షో ద్వారా వచ్చింది.
ఉదాహరణకి నిన్న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో రేవంత్ తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించేలా చేసింది..తనకి డబ్బులు ముఖ్యం కాదని..ట్రోఫీ ఒక్కటే ముఖ్యమని చెప్పుకుంటూ వచ్చిన రేవంత్ అదే మాట మీద నిలబడ్డాడు..బిగ్ బాస్ ఎన్ని రకాల టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడా రేవంత్ తడబడలేదు.

తాను తీసుకున్న నిర్ణయాన్ని బలంగా నమ్మాడు..అందుకే ఆయనకీ ట్రోఫీ తో పాటు పది లక్షల రూపాయల క్యాష్, మరియు 25 లక్షల రూపాయిలు విలువ చేసే ఇల్లు మరియు కార్ లభించింది..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ గెలిచాడని నాగార్జున చెప్పాడు..ఒకవేళ శ్రీహాన్ 40 లక్షలు తీసుకోవడానికి ఒప్పుకోకపోయుంటే రేవంత్ కి ట్రోఫీ దక్కపోయేది..చిల్లి గవ్వ కూడా చేతికి వచ్చేది కాదు..తాను బలంగా నమ్మిన దాని మీద ఎన్ని టెంప్టింగ్ ఆఫర్లు వచ్చినా శ్రీహాన్ లాగా లొంగిపోకుండా ఉన్నాడు కాబట్టే అతను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నాడు..కోట్లాది మంది అభిమానాన్ని దక్కించుకున్నాడు అని నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.