Bigg Boss 6 Telugu- Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా రేవంత్ నిలిచినప్పటికీ..శ్రీహాన్ మరియు రేవంత్ ఇద్దరూ కూడా టైటిల్ విన్నర్స్ అని అక్కినేని నాగార్జున ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..బిగ్ బాస్ చరిత్ర లో ఒక సీజన్ లో ఇలా ఇద్దరు కంటెస్టెంట్స్ గెలవడం అనేది ఎప్పుడూ జరగలేదు..ప్రారంభం నుండే ఈ సీజన్ ప్రేక్షకుల అంచనాలకు పూర్తి బిన్నంగా సాగుతూ వచ్చింది..టాస్కుల దగ్గర నుండి ఎలిమినేషన్స్ వరుకు అన్నీ ఊహించని విధంగానే జరుగుతూ వచ్చింది.

ఒకానొక్క సందర్భం లో ప్రేక్షకులకు ఈ షో మీద విరక్తి కలిగేలా చేసారు బిగ్ బాస్ టీం..ట్విస్టులనే నమ్ముకున్న ఈ సీజన్ డిజాస్టర్ కాకుండా పర్వాలేదని అనిపించుకుంది..టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఈ సీజన్ మొత్తం కలిపి యావరేజి రేంజ్ అని చెప్పొచ్చు..ఇది ఇలా ఉండగా ఈ సీజన్ ప్రారంభం నుండి చివరి వరుకు కంటెస్టెంట్స్ అందరికంటే ఎక్కువ ఓట్లు రప్పించుకుంటూ తనకి పోటీ ఎవ్వరు లేరు అనే విధంగానే రేవంత్ జర్నీ సాగింది.
సోషల్ మీడియా లో జరిగే వెబ్సైట్ పొలింగ్స్ ప్రకారం కూడా రేవంత్ టైటిల్ విన్నర్ అని, అతనికే ఎక్కువ ఓట్లు వచ్చాయని అందరూ అనుకున్నారు..కానీ చివర్లో నాగార్జున మాత్రం ‘ఎవరికీ ఎక్కువ ఓట్లు వచ్చాయో చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను..స్వల్ప ఓట్ల తేడా తో శ్రీహాన్ కి రేవంత్ మీద ఎక్కువ ఓట్లు వచ్చాయి’ అని అంటాడు..వాస్తవానికి నాగార్జున అలా చివరి నిమిషం మార్చి చెప్పాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..వాస్తవానికి రేవంత్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి..కానీ నాగార్జున హౌస్ లోపలకు సూట్ కేసు తో అడుగుపెట్టి శ్రీహాన్ మరియు రేవంత్ ఇద్దరికీ 40 లక్షల ఆఫర్ ఇవ్వడం తో రేవంత్ ట్రోఫీ గెలవడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపగా, శ్రీహాన్ మాత్రం 40 లక్షలు తీసుకొని బయటకి వస్తాడు..ఇది నిజంగా ఎవ్వరు ఊహించలేదు.

అలాంటి ఊహించని పరిణామం జరిగింది కాబట్టే, ఓట్ల ద్వారా గెలుపొందిన కంటెస్టెంట్ కంటే రన్నర్ కి ఎక్కువ క్యాష్ ప్రైజ్ వచ్చిందని తెలిస్తే అందరూ బిగ్ బాస్ పై తీవ్రమైన నెగటివిటీ చూపిస్తారని..దాని ప్రభావం తదుపరి సీజన్ మీద కూడా పడే అవకాశం ఉన్నందున, ఇలా నాగార్జున చివరి నిమిషం లో అబద్దం చెప్పాడని ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్.