Health Risks Of Mobile Phones: ఇప్పుడు అంతా ఫోన్ల ప్రపంచమే. ఎటు చూసినా మొబైళ్ల మోతే. సంభాషణల గోల సామాజిక మాధ్యమాల లీల వెరసి ప్రస్తుతం మనుషులతో మాట్లాడటం మానేశారు. అంతా ఫోన్లలోనే మాట్లాడుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఏదైనా సరే దాంతోనే వారి కాలక్షేపం. ఎవరిని పట్టించుకోవడం లేదు. ఏమిటని ప్రశ్నించడం లేదు. ఇరవై నాలుగు గంటలు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. చాటింగ్ చేయాల్సందే. ఎప్పుడు ఫోన్ తోనే సహజీవనం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక మనుషుల స్టైలే మారిపోయింది. ఎప్పుడు చూసినా ఫోన్ లోనే చాటింగ్ లు, సందేశాలు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇదేమిటంటే ఫ్యాషన్ అని చెబుతున్నారు.

ఎప్పుడూ ఫోన్ చూడటాన్ని ఫోన్ ఫోబియా అంటారు. అదో రకమైన వ్యసనమే. దాంతో చాలా ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో పలు రోగాలకు కూడా కారకులవుతున్నారు. మనుషులతో మాట్లాడితేనే బంధాల విలువ తెలుస్తుంది. కానీ ఫోన్లతో కాలం గడిపితే అంే. గంటల తరబడి ఫోన్ లో చాటంగ్, స్క్రోలింగ్ చేయడం వల్ల వేళ్లు వంకర్లు పోవడం ఖాయం. చేతుల్లో ఉండే కండరాల్లో తీవ్ర నొప్పి వచ్చి భవిష్యత్ లో అవి పనిచేయకుండా పోతాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సేపు మొబైల్ చూడటం వల్ల మెడ నొప్పి ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని టెక్ నెక్ అని పిలుస్తారు. మెదడు నుంచి మొబైల్ ను చూడటం వల్ల మెడపై భారం పడి నొప్పి తీవ్రమవుతుంది. దీంతో మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. కొంత మంది ఫోన్ మోగకపోయినా అలర్టు అవుతుంటారు. సందేశాలు రాకపోయినా ఫోన్ ను చెక్ చేస్తుంటారు. ఇదో రకమైన వ్యాధిగా చెబుతున్నారు. ఏదో అయిందనే భ్రమ కలగడంతో వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఫోన్ల వల్ల వస్తున్నాయి.

కంప్యూటర్ లో కానీ మొబైల్ లో గానీ చిన్న సైజు ఫాంట్ లో ఉన్న వాటిని తీవ్రంగా చూస్తూ చదువుతుంటారు. దీనివల్ల స్క్రీన్ పై ఎక్కువ సేపు దృష్టి నిలపడం వల్ల కళ్లు అలసిపోతాయి. అవి పొడిబారతాయి. దీంతో కళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ చేజారిపోతుందని భయపడుతుంటారు. పదేపదే ఫోన్ ను చూసుకుంటారు. ఇది కూడా ఓ రుగ్మతే కావడం గమనార్హం. దీన్ని నోమో ఫోబియా అంటారు. ఇలా మొబైళ్లతో ఎన్నో సమస్యలున్నా ఎవరు కూడా వాటిని విడిచిపెట్టడం లేదు. వాటితోనే నిరంతరం కాలక్షేపం చేస్తున్నారు. భవిష్యత్ లో మాత్రం మరిన్ని సమస్యలు ఎదుర్కోవడం ఖాయం.