Bigg Boss 6 Telugu- Revanth: బిగ్ బాస్ హౌస్ ఈ వారం మొత్తం టికెట్ 2 ఫినాలే టాస్కు తో మంచి వేడి మీదున్న సంగతి తెలిసిందే..వివిధ లెవెల్స్ లో హోరాహోరీగా సాగిన ఈ టాస్కు లో టాప్ 2 కంటెస్టెంట్స్ గా శ్రీహాన్ మరియు రేవంత్ నిలిచారు..వీళ్ళిద్దరిలో శ్రీహాన్ టికెట్ గెలిచి ఫినాలే వీకెండ్ కి వెళ్లాడనే టాక్ ఉంది కానీ , ఇప్పటికి ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు..ఇక ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ వీకెండ్ లో నాగార్జున హౌస్ మేట్స్ అందరిని తిడుతాడని అనుకున్నారు.

కానీ ఈ వీకెండ్ హౌస్ మేట్స్ తో పాటుగా ప్రేక్షకులను కూడా బాగా ఎమోషనల్ చేసేసాడు బిగ్ బాస్..హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తూ టైటిల్ కి చేరువలో ఉన్న రేవంత్ కి మొన్న కూతురు పుట్టిందని విషయం అందరికి తెలిసిందే..ఈరోజు నాగార్జున రేవంత్ సర్ప్రైజ్ ఇస్తూ బిడ్డని వీడియో కాల్ ద్వారా చూపించారు.
దీనికి సంబంధించిన ప్రోమో ని విడుదల చెయ్యగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది..తన బిడ్డని చూసుకుంటూ రేవంత్ ఎమోషనల్ అవ్వడం అందరి హృదయాలను బాగా కదిలించింది..సరైన సమయం లో నేను పక్కనే లేనే అంటూ రేవంత్ బాధపడడం చూసి ఆయన అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు..ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా రేవంత్ కి శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు..రేవంత్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా శ్రీహాన్ మరియు శ్రీ సత్య ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

ఇక మిగిలిన ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడక తప్పదు..ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు రేవంత్ , రోహిత్ , ఫైమా , ఆది రెడ్డి , కీర్తి మరియు శ్రీ సత్య..వీరిలో ఫైమా కి అతి తక్కువ ఓట్లు రావడం తో ఆమె ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది..ఇందులో ఎంతవరుకు నిజం ఉందొ ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.
