
RBI Locker Rules: బంగారం, డబ్బును దొంగల బారిన పడకుండా చాలామంది బ్యాంకు లాకార్లలో దాచుకుంటారు. దీనికోసం బ్యాంకుకు కొంత మొత్తంలో ఫీజు చెల్లిస్తారు.. మళ్లీ అవసరమనుకున్నప్పుడు లాకర్ నుంచి తీసుకుంటారు.. ఇది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతే.. అయితే ఇప్పుడు ఈ నిబంధనలను ఆర్బిఐ మరింత కఠిన తరం చేసింది.. వాటిని పాటించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరిస్తోంది. లాకర్ లో ఉన్న వినియోగదారులు బ్యాంకుతో కొత్త ఒప్పందం చేసుకోవాలని ఆర్.బి.ఐ స్పష్టం చేస్తోంది.. ఇందుకోసం 200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని సూచిస్తోంది.
Also Read: Jayamangalam Venkataramana: టీడీపీకి పెద్ద షాక్.. పార్టీని వీడిన మరో నేత
వాస్తవానికి కొత్త ఒప్పందాలకు సంబంధించిన గడవు జనవరి 1తోనే ముగిసింది. ఒప్పందం చేసుకుని వినియోగదారుల లాకర్లను సీజ్ చేశాయి కూడా. అయితే చాలామంది ఒప్పందం చేసుకోకపోవడంతో గడువు తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఆర్బిఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన లాకర్లను తిరిగి వినియోగించుకునే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఒప్పందాల విషయంలో దశలవారీగా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. వచ్చే జూన్ 30 నాటికి 50%, సెప్టెంబర్ 30 నాటికి 75%, డిసెంబర్ 31 నాటికి నూటికి నూరు శాతం మంది ఖాతాదారులతో ఒప్పందాలు పూర్తి చేసుకోవాలని ఆర్బిఐ స్పష్టం చేసింది. గురించి ఖాతాదారులకు సమాచారం తక్షణమే పంపాలని బ్యాంకులకు సూచించింది.

కొత్త ఒప్పందం ప్రకారం వినియోగదారులు లాకర్లలో నగదు దాచుకోకూడదని ఆర్బిఐ స్పష్టం చేసింది. లాకర్ కేటాయించే సమయంలో కస్టమర్లకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకులు నమోదు చేయాలని ఆర్బిఐ సూచించింది. ఈ లాకర్ సదుపాయాన్ని పొందేందుకు ఏటా చెల్లించవలసిన నిర్వహణ సొమ్మును కొంతమేర వడ్డీ వచ్చేలా ముందుగానే ఖాతాదారులతో డిపాజిట్ చేయమని కొన్ని బ్యాంకులు కోరుతున్నాయి. లాకర్లకు సంబంధించి ఆర్బిఐ ఈ నిబంధనలు తీసుకురావడం వెనుక అసలు కారణం వేరే ఉంది.. పెద్ద నోట్ల రద్దు తర్వాత లాకర్ల నుంచి భారీగా నోట్ల కట్టలు విడిపించి తీసుకున్నట్టు గుర్తించింది.. పైగా చాలామంది కూడా 2000 నోట్లను ఈమధ్య లాకర్లలో భద్రపరుచుకుంటున్నారు.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం నగలు, విలువైన పత్రాలకు మాత్రమే లాకర్ సౌకర్యం కల్పిస్తున్న బ్యాంకులు.. ఆర్.బి.ఐ నిబంధనల ప్రకారం నగదు నుంచి రేడియోధార్మిక వస్తువుల వరకు వేటిని కూడా లాకర్లలో భద్రపరచనివ్వరు..