https://oktelugu.com/

Ravanasura Trailer Review : ‘రావణాసుర’ ట్రైలర్ అదిరిపోయింది.. రవితేజ ఫామ్ మామూలుగా లేదుగా!

Ravanasura Trailer Review : మాస్ మహారాజ రవితేజ కి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది.ఈమధ్య కాలం లో ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తున్నాయి.గత ఏడాది ‘ధమాకా’ సినిమా తో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్య సెన్సేషనల్ నంబర్స్ పెట్టిన రవితేజ, ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2023 / 04:41 PM IST
    Follow us on

    Ravanasura Trailer Review : మాస్ మహారాజ రవితేజ కి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది.ఈమధ్య కాలం లో ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తున్నాయి.గత ఏడాది ‘ధమాకా’ సినిమా తో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్య సెన్సేషనల్ నంబర్స్ పెట్టిన రవితేజ, ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

    ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రావణాసుర చిత్రం వచ్చే నెల 7 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇది వరకే విడుదలైంది.ఈరోజు ట్రైలర్ వచ్చింది, ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూసారు.ఎందుకంటే రవితేజ పాత్ర టీజర్ తోనే కాస్త కొత్తగా అనిపించింది కాబట్టి.అలా భారీ అంచనా నడుమ విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.

    ‘రావణాసుర’ అనే టైటిల్ చూడగానే ఈ చిత్రం మొత్తం సీరియస్ జానర్ లో సాగిపోతుందేమో అని అందరూ అనుకున్నారు.టీజర్ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మన అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.ఈ చిత్రం లో ఎంటర్టైన్మెంట్ శాతం బాగా ఎక్కువే, రవితేజ నుండి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నట్టుగా అనిపించింది.రవితేజ సీరియల్ కిల్లర్ గా ఎందుకు మారాడు..?, అసలు ‘రావణాసుర’ అనే టైటిల్ ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.

    ఫ్యాన్స్ కి ఈ ట్రైలర్ చూసిన తర్వాత రవితేజ కెరీర్ లో మరో కిక్ లాంటి బ్లాక్ బస్టర్ పడబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో అక్కినేని సుశాంత్ ఒక కీలక పాత్ర పోషించగా, మేఘ ఆకాష్, ఫైరా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్ మరియు దక్ష నాగర్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ట్రైలర్ అయితే మూవీ పై మంచి బజ్ ని తీసుకొచ్చింది.సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.