
Ravanasura First Week Collections: వరుసగా ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ గా నటించిన ‘రావణాసుర’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సినిమాకి మంచి వసూళ్లు రావాలి, కానీ హీరో క్యారక్టర్ నెగటివ్ రోల్ అవ్వడం తో కలెక్షన్స్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడింది.
మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి, ఇక ఆ తర్వాత కలెక్షన్స్ రోజురోజుకి తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు అన్నీ ప్రాంతాలలో రోజువారీ షేర్స్ రావడం కూడా చాలా కష్టం అయిపోయింది.ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 22 కోట్ల రూపాయిలను పెట్టి థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసారు బయ్యర్స్.వాళ్లకి ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ చూసి మింగుడు పడడం లేదు.ఇది ఇలా ఉండగా వారం రోజులకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.ఎందుకంటే అసలు ఈ చిత్రానికి విడుదలకు ముందు అసలు హైప్ లేదు, కేవలం రవితేజ పేరు మీద వచ్చిన ఓపెనింగ్ అది.అయితే రెండవ రోజు నుండి డివైడ్ టాక్ ఎఫెక్ట్ పడింది.’ధమాకా’ కి కూడా ఇలాంటి డివైడ్ టాక్ వచ్చింది, ఆ చిత్రం సెన్సేషన్ సృష్టించి సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.’రావణాసుర’ కి కూడా అదే రేంజ్ టాక్ వచ్చింది, కానీ వసూళ్లు రాకపోవడానికి కారణం అది కమర్షియల్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా కాదు.

అందులోనూ హీరోది నెగటివ్ రోల్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వైపు కూడా చూడలేదు.అయితే ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం మొదటి వారం ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చిందట.బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 13 కోట్లు వసూలు చెయ్యాలి, అది దాదాపుగా అసాధ్యం అంటున్నారు ట్రేడ్ పండితులు.అలా ఈ చిత్రం రవితేజ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.