https://oktelugu.com/

Ravi Teja’s ‘Dhamaka’ : ‘ధమాకా’ మొదటి వారం వసూళ్లు.. స్టార్ హీరోలకు కూడా ఇలాంటి వసూళ్లు అసాధ్యం!

Ravi Teja’s ‘Dhamaka’ :  ఈ ఏడాది మూవీ బయ్యర్స్ పంట పడింది అనే చెప్పాలి..ఏడాది మధ్యలో ఇండస్ట్రీ కొంత కాలం గడ్డు పరిస్థితి ఎదురుకున్నప్పటికీ ఆ తర్వాత నుండి వరుసగా సూపర్ హిట్స్ తో లాభాలను గట్టిగానే మూటగట్టుకున్నారు.. ముఖ్యంగా ఈ ఏడాది చిన్న సినిమాలదే హవా..తక్కువ థియేట్రికల్ బిజినెస్ తో కనీవినీ ఎరుగని లాభాలను చూసారు..ఆ కోవలోకి లేటెస్ట్ గా చేరిపోయిన చిత్రం ధమాకా..వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన మాస్ మహారాజ రవితేజ కి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2022 / 09:50 PM IST
    Follow us on

    Ravi Teja’s ‘Dhamaka’ :  ఈ ఏడాది మూవీ బయ్యర్స్ పంట పడింది అనే చెప్పాలి..ఏడాది మధ్యలో ఇండస్ట్రీ కొంత కాలం గడ్డు పరిస్థితి ఎదురుకున్నప్పటికీ ఆ తర్వాత నుండి వరుసగా సూపర్ హిట్స్ తో లాభాలను గట్టిగానే మూటగట్టుకున్నారు.. ముఖ్యంగా ఈ ఏడాది చిన్న సినిమాలదే హవా..తక్కువ థియేట్రికల్ బిజినెస్ తో కనీవినీ ఎరుగని లాభాలను చూసారు..ఆ కోవలోకి లేటెస్ట్ గా చేరిపోయిన చిత్రం ధమాకా..వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన మాస్ మహారాజ రవితేజ కి ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన ఊపు మామూలుది కాదు.

    పబ్లిక్ టాక్ మొదటి రోజు నుండి యావరేజి గా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ విషయం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం వండర్స్ సృష్టిస్తుంది..మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే రవితేజ మాస్ బ్యాటింగ్ మొదలు పెట్టాడు..మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు మూడు కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూలు చేసింది.

    ఇక మూడవ రోజు క్రిస్మస్ అవ్వడం తో ఈ చిత్రానికి కాసుల వర్షం మాములుగా రాలేదు..మొదటి రోజు నాలుగు కోట్ల 66 లక్షల రూపాయిలు షేర్ వసూలు చేస్తే మూడవ రోజు ఏకంగా 5 కోట్ల 18 లక్షల రూపాయిలు వచ్చాయి..రొటీన్ సినిమా అనే టాక్ ఉంది కాబట్టి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ బాగా పడిపోతాయని అందరూ అనుకున్నారు..కానీ నాల్గవ రోజు ఈ సినిమా రెండవ రోజు తో సమానంగా 3 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..ఐదవ రోజు రెండు కోట్ల 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఆరవ రోజు కోటి 67 లక్షలు.

    7 వ రోజు కోటి నలభై లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..అలా మొత్తం మీద వారం రోజులకు గాను ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 19 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..డివైడ్ టాక్ తో మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వచ్చేసింది..అలా డివైడ్ టాక్ తో లాభాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సినిమాలలో ధమాకా కూడా ఒకటిగా నిలిచింది.