Dhamaka Collections: మాస్ మహారాజ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది రీసెంట్ గా విడుదలైన ‘ధమాకా’ చిత్రం..వరుస ఫ్లాప్స్ తో ఇక రవితేజ భవిష్యత్తులో హిట్టు కొట్టగలడా అని అభిమానులు నిరాశ చెందుతున్న సమయం లో ధమాకా మూవీ వాళ్లకి ఇచ్చిన కిక్ మామూలుది కాదు..పబ్లిక్ టాక్ పెద్దగా లేకపోయినా, చాలా కాలం తర్వాత వచ్చిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కావడం తో జనాలు ఈ సినిమా చూడడానికి ఎగబడుతున్నారు.

రొటీన్ సినిమా కదా..వీకెండ్ దాటితే సోమవారం నుండి కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతాయని అందరూ అనుకున్నారు..కానీ సోమవారం నుండి కూడా ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది..రవితేజ మామూలు హిట్ కొడితేనే ఇలా ఉందంటే, కిక్ రేంజ్ బ్లాక్ బస్టర్ కొడితే కచ్చితంగా వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొడుతాడని ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు.
5 రోజులకు గాను ఈ సినిమా సుమారుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు..మొదటి రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు రావడం ఒక విశేషం అయితే, వర్కింగ్ డేస్ లో కూడా మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్స్ ని రాబట్టడం మరో విశేషం..అలా 5 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి 23 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

ముఖ్యంగా నైజాం ప్రాంతం ఈ సినిమా 5 రోజులకు 9 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసింది..సంక్రాంతి వరకు రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..అన్ని రోజులు రన్ వస్తే కచ్చితంగా 20 కోట్ల రూపాయిల షేర్ కేవలం నైజాం ప్రాంతం నుండి వస్తాయట..ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని రవితేజ నుండి ఎవ్వరూ ఊహించలేదు..ఆయన కెరీర్ కి మరో మైలు రాయిగా నిలిచిపోయింది ఈ చిత్రం.