Vikramarkudu 2: మాస్ మహారాజ రవితేజ ఊపు ప్రస్తుతం మామూలు రేంజ్ లేదు..క్రాక్ తర్వాత సరైన హిట్ లేకుండా డీలాపడిన రవితేజ ‘ధమాకా’ చిత్రం తో ఊరమాస్ కం బ్యాక్ ఇచ్చాడు..రవితేజ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించే చిత్రం గా ముందుకు దూసుకుపోతుంది..ఇప్పటి వరకు ఈ చిత్రానికి పది రోజులకు గాను 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13 వ తేదీన విడుదల కాబోతుంది..ఈ సినిమాలో రవితేజ విక్రమార్కుడు రేంజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని చేసాడు..అలా వరుసగా బ్యాక్ 2 బ్యాక్ సినిమాలు చేసిన రవితేజ త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
త్వరలోనే ఆయన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అట..అది కూడా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ ని తియ్యాలనే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నట్టు తెలుస్తుంది..ఇప్పటికే రవితేజ ని కలిసి ఈ విషయంపై చర్చించాడట..ఈ సినిమా కి కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించాడు..రవితేజ కోసం ఆయన ఎప్పుడో ఈ కథని సిద్ధం చేసాడు..కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పోస్టుపోన్ అవుతూ వచ్చింది..రాజమౌళి ఈ సినిమాని ఇప్పుడు తీసే అవకాశమే లేదు గనుక, ఆ కథని బోయపాటి శ్రీను కి ఇచ్చేశాడట విజయేంద్ర ప్రసాద్.

ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది..గతం లో రవితేజ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భద్ర అనే సినిమా వచ్చింది..ఇదే బోయపాటి శ్రీను కి మొట్టమొదటి సినిమా..అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..మళ్ళీ ఆ కాంబినేషన్ లో ఈ విక్రమార్కుడు 2 అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.