kirak RP: ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ చానెల్స్ వల్ల ఎంతమంది ఎదిగారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఈ షో నుండి వచ్చిన ఎంతోమంది కమెడియన్స్ నేడు ఇండస్ట్రీ లో స్టార్ కమెడియన్స్ గా బ్రతుకుతున్నారు..సుడిగాలి సుధీర్ , హైపర్ ఆది, చమ్మక్ చంద్ర , గెటప్ శ్రీను, షకలక శంకర్ ఇలా ఒక్కరా ఇద్దరా,ఇలా ఎంతోమందికి అద్భుతమైన విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చింది ఈ షో..అలా వీళ్లతోపాటుగా కిరాక్ ఆర్ఫీ కూడా తనదైన స్టైల్ తో నెల్లూరు యాస తో కామెడీ చేస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.

డబ్బులు కూడా బాగానే సంపాదించాడు..ఆ తర్వాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో వచ్చిన ఒక చిన్న క్లాష్ వల్ల జబర్దస్త్ షో నుండి తప్పుకున్నాడు..ఆ తర్వాత కొన్ని రోజులు మాటీవీ లో పలు షోస్ చేసాడు..అలా డబ్బులు బాగా సంపాదించిన తర్వాత హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే రెస్టారంట్ ని ప్రారంభించాడు..అన్ని రకాల చేప వంటకాలు ఈ రెస్టారంట్ లో ఉంటాయి.
ఒక చిన్న రెస్టారంట్ గా నడుపుదామని ప్రారంభించాడు కిరాక్ ఆర్ఫీ, కానీ ఊహించని రేంజ్ లో ఈ రెస్టారంట్ సక్సెస్ అయ్యి హైదరాబాద్ ప్రజలకు మెంటలెక్కిపొయ్యే విధంగా రుచికరమైన వంటకాలతో అబ్బురపరిచింది..కేవలం ఈ రెస్టారంట్ లో వంటకాలను ఆస్వాదించేందుకు హైదరాబాద్ నలుమూలల నుండి వచ్చి, గంటలతరబడి క్యూ లైన్స్ లో నిలబడి జనాలు కొనుక్కొని వెళ్తున్నారు..సక్సెస్ ఊహించని రేంజ్ లో రావడం, రోజు రోజుకి జనాల తాకిడి పెరిగిపోతూ ఉండడం తో, ఆర్ఫీ కొంతకాలం వరకు రెస్టారంట్ ని మూసివెయ్యాలనే ఆలోచనకి వచ్చాడు.

మరికొద్ది రోజుల్లోనే కాస్త ఎక్కువ స్టాఫ్ తో హోటల్ ని ఘనంగా ప్రారంభిస్తాను అంటూ ఆర్ఫీ ఈ సందర్భంగా తెలిపాడు..ఈ రెస్టారంట్ ద్వారా ఆర్ఫీకి ఒక రోజు జరిగే బిజినెస్ అక్షరాలా పది లక్షల రూపాయలట..అంటే నెలకి మూడు కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు అన్నమాట..ఒక చిన్న కమెడియన్ హైదరాబాద్ లో ఇంత పెద్ద రెస్టారంట్ ని నడిపే రేంజ్ కి ఎదిగాడు అంటే మామూలు విషయం కాదు.