https://oktelugu.com/

Asalu Movie Review: రవిబాబు ‘అసలు’ మూవీ రివ్యూ

Asalu Movie Review: సీనియర్ నటుడు చలపతి రావు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవిబాబు నటుడిగా , దర్శకుడిగా సక్సెస్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. నటుడిగా కంటే కూడా, దర్శకుడిగా రవిబాబు గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఈయన ఫిలిం మేకింగ్ స్టైల్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.’అల్లరి’ అనే చిత్రం తో దర్శకుడిగా పరిచయమైనా రవిబాబు ఆ తర్వాత ‘అమరావతి’ , ‘అనసూయ’ మరియు ‘అవును’ వంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను […]

Written By:
  • Vicky
  • , Updated On : April 14, 2023 / 07:31 AM IST
    Follow us on

    Asalu Movie Review

    Asalu Movie Review: సీనియర్ నటుడు చలపతి రావు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవిబాబు నటుడిగా , దర్శకుడిగా సక్సెస్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. నటుడిగా కంటే కూడా, దర్శకుడిగా రవిబాబు గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఈయన ఫిలిం మేకింగ్ స్టైల్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.’అల్లరి’ అనే చిత్రం తో దర్శకుడిగా పరిచయమైనా రవిబాబు ఆ తర్వాత ‘అమరావతి’ , ‘అనసూయ’ మరియు ‘అవును’ వంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తీసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాడు. అయితే చాలా కాలం నుండి రవిబాబు సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహించిన మరో క్రైమ్ థ్రిల్లర్ ‘అసలు’ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈటీవీ విన్ యాప్ లో ఈ చిత్రాన్ని మనం వీక్షించవచ్చు.ఇందులో హీరోయిన్ గా పూర్ణ నటించింది, గతం లో రవిబాబు తీసిన అవును మరియు అవును 2 లో కూడా పూర్ణ హీరోయిన్ గా నటించింది.ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ ‘అసలు’ వచ్చింది.

    రవిబాబు లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పోస్టర్స్ దగ్గర నుండే ఆడియన్స్ లో ఆసక్తి ని కలుగచేస్తాడు.ఇక టీజర్ మరియు ట్రైలర్ తో అంచనాలను అమాంతం పెంచేయడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య.విచిత్రమైన టైటిల్స్ తో సరికొత్త టేకింగ్ తో ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చెయ్యడం రవిబాబు స్పెషాలిటీ, అసలు సినిమా విషయం లో కూడా అదే చేసాడు. పోస్టర్స్ దగ్గర నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాడు, ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలను అమాంతం పెంచేసాడు.

    Asalu Movie Review

    ఒక ఇంట్లో జరిగిన దారుణ హత్య ని ఛేదించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇందులో రవిబాబు ని మనం చూడవచ్చు. ఈ హత్య గురించి నలుగురిపై ఆయనకీ అనుమానం కలుగుతుంది. వాళ్ళని విచారిస్తున్న సమయం లో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు బయటపడుతాయి. ఆ రహస్యాలు ఏమిటి..?, ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు అనేది తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.స్క్రీన్ ప్లే విషయం లో రవిబాబు స్టైల్ వేరు,అసలు చిత్రం ప్రారంభం నుండి చివరి వరకు తర్వాత ఏమి జరుగబోతోంది అనే ఉత్కంఠ ని ప్రేక్షకుల్లో కలిగించడంలో ఆయన సఫలం అయ్యాడు. ఈ సినిమాని చూసే ఆడియన్స్ కి కచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ ని చూసాము అనే అనుభూతి కలుగుతుంది. థ్రిల్లర్ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాని మిస్ కాకండి,ఈ వీకెండ్ మంచి టైం పాస్ అయ్యే చిత్రం ‘అసలు’.