
Rashmika Mandanna Birthday: బీ టౌన్ ను ఏలుతున్న సౌత్ ముద్దుగుమ్మ ఎవరంటే రష్మిక మందానా పేరు చెప్పొచ్చు. చిన్నపాటి ప్రకటనల్లో కనిపించిన ఈ భామ ఇప్పుడు నేషనల్ లెవల్లో స్టార్ ఇమేజ్ దక్కింది. ఒక సౌత్ హీరోయిన్ కు అతి తక్కువ సమయంలో ఇంతటి గుర్తింపు రావడంతో ఇండస్ట్రీలో ఆమె గురించి హాట్ టాపిక్ ఉంటుంది. లేతేస్టుగా సమంత తెలుగు, తమిళంతో పాటు హిందీ సినిమాల్లోనూ బిజీ హీరోయిన్ అయింది. ఆమె కాల్షీట్ల కోసం కొందరు డైరెక్టర్లు, హీరోలు వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. క్షణం తీరిక లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
రష్మిక మందానా స్వస్థలం కర్ణాటక. 1996 ఏప్రిల్ 6న కొడుగు జిల్లా విరాట్ పేట్ లో జన్మించారు. సుమన్, మదన్ మందన్న ఆమె తల్లిదండ్రులు. రష్మిక ప్రాథమిక విద్యాభ్యాసం కొడుగు జిల్లాలో పూర్తి చేసుకుంది. ఎంఎస్ రామయ్య కాలేజీలో పై చదువులు పూర్తి చేశారు. రష్మికకు మోడలింగ్ అంటే బాగా ఇష్టం. ఆ ఇంట్రెస్టుతో పలు ప్రకటనలు చేసి గుర్తింపు పొందారు. ఆ తరువాత ఆమె 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా’టైటిల్ ను గెలుచుకున్నారు.
ఈ టైటిల్ తో రష్మిక సినిమా డైరెక్టర్ల దృష్టిలో పడ్డారు. దీంతో ఆమెను సినిమాల్లోకి తీసుకోవాలని అనుకున్నారు. అలా 2016లో ‘కిర్రాక్ పార్టీ’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్టుకొట్టింది. అయితే ఇందులో రష్మిక నటనకు ఫిదా అయిన వెంకీ కుడుమల ఆమెకు తెలుగులో ‘చలో’ సినిమాలో అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాతోనే ఆమెకు టాలీవుడ్లో గుర్తింపు వచ్చింది. అయితే స్టార్ ఇమేజ్ దక్కలేదు. ఆ తరువాత అల్లు అరవింద్ మూవీ ‘గీత గోవిందం’ సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుకావడంతో రష్మికాకు స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆయితే ఆ తరువాత నటించిన కొన్ని సినిమాలు మళ్లీ యావరేజ్ గా హిట్ కొట్టడంతో అందరిలాగే రష్మిక అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక నటన విశ్వరూపాన్ని చూపారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంతో సినిమాతో పాటు రష్మికాకు స్టార్ ఇమేజ్ దక్కింది. దీంతో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు తట్టాయి. ఇలా మిషన్ మజ్ను సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ‘అనిమల్’ అనే మరోసినిమాలో ఓ స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
నటనా పరంగా మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా ఉండడంతో పాటు అందాలు ఆరబోయడంలో రష్మికా ఏమాత్రం వెనుకాడదని ఇండస్ట్రీలో టాక్. సినిమాల్లో కాకుండా స్పెషల్ ఈవెంట్లలో ఆమె డ్రెస్సింగ్ తో పలువురిని ఆకర్షించింది. ఆ మధ్య ఓ గౌనులో రష్మిక కు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. అయితే కొందరు అవకాశాల కోసం రష్మిక ఇలా చేస్తున్నారని అంటుండగా..మరి కొందరు బ్యూటీ షో చేస్తే తప్పేంటి? అని సపోర్టు చేస్తున్నారు. ఇక రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమెకు పలువురు విషెష్ చెబుతున్నారు.