https://oktelugu.com/

Rashmika Mandana: విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిన రష్మిక..? మరో కుర్ర హీరోకి గాలం, ముంబైలో చెట్టాపట్టాల్!

Rashmika Mandana: హీరోయిన్ రష్మిక మందాన తన రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి కొన్ని ఆధారాలు చూపుతూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక జీవితంలో మొదటి నుండి వివాదాలే. పరిశ్రమలో అడుగు పెడుతూనే ఈ భామ ప్రేమలో పడింది. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టిని ఘాడంగా ప్రేమించింది. మేటర్ పెళ్లి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 1, 2023 / 05:22 PM IST
    Follow us on

    Rashmika Mandana

    Rashmika Mandana: హీరోయిన్ రష్మిక మందాన తన రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి కొన్ని ఆధారాలు చూపుతూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక జీవితంలో మొదటి నుండి వివాదాలే. పరిశ్రమలో అడుగు పెడుతూనే ఈ భామ ప్రేమలో పడింది. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టిని ఘాడంగా ప్రేమించింది. మేటర్ పెళ్లి వరకు వెళ్ళింది. నిశ్చితార్థం జరిగాక రష్మిక మనసు మార్చుకుంది. సింపుల్ గా రక్షిత్ శెట్టికి గుడ్ బై చెప్పేసింది.

    రక్షిత్ శెట్టి అభిమానులు రష్మిక మీద ఫైర్ అయ్యారు. విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ పరిణామంతో కన్నడ పరిశ్రమలో రష్మిక ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. అక్కడి నుండి మూటాముల్లె సర్దుకుంది. అనూహ్యంగా టాలీవుడ్ లో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు స్టార్ హీరోయిన్ ని చేశాయి. కాగా విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు చేసిన రష్మిక అతనికి దగ్గరయ్యారనే పుకారు ఉంది.

    Rashmika Mandana

    విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి తో కూడా రష్మిక సన్నిహితంగా ఉంటున్నారు. రెండుసార్లు విజయ్ దేవరకొండ-రష్మిక మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ ఒకే హోటల్ రూమ్ లో స్టే చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. అడ్డంగా బుక్కయ్యాక… ఫ్రెండ్ తో టూర్ కి వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. లైగర్ మూవీ షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబైలోనే ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరూ పలుమార్లు నైట్ డిన్నర్ పార్టీలకు వెళుతూ కెమెరా కంటికి చిక్కారు.

    ట్విస్ట్ ఏమిటంటే… విజయ్ దేవరకొండకు కూడా రష్మిక హ్యాండ్ ఇచ్చిందట. ఆమె కొత్త లవర్ ని పట్టిందంటూ మీడియా కోడై కూస్తుంది. ఆ నయా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ముంబైలో పలు ఈవెంట్లో కలిసి కనిపిస్తున్న సాయి శ్రీనివాస్-రష్మిక రిలేషన్ స్టార్ట్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, యానిమల్, నితిన్ చిత్రాలు చేస్తున్నారు.