https://oktelugu.com/

Emmanuel- Varsha: ఇమ్మానియేల్ కి వర్ష షాక్… వేరే బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాల్, వీడియోలు బయటకు రావడంతో!

Emmanuel- Varsha: సుధీర్ -రష్మీ తర్వాత ఆ రేంజ్ లో బుల్లితెర ప్రేమికులుగా పాపులర్ అయ్యారు వర్ష-ఇమ్మానియేల్. ఈ జబర్దస్త్ కమెడియన్స్ వారిద్దరినీ ఫాలో అవుతున్నారు. చెప్పాలంటే అంతకు మించి. వర్ష అయితే ఇమ్మానియేల్ మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తుంది. ఆమె చెప్పే ఎమోషనల్ లవ్ డైలాగ్స్ పిచ్చెక్కిస్తాయి. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం. నా పట్ల చాలా కేరింగ్ ఉంటాడు. ఎవరేమైనా అనుకోని ఇమ్మానియేల్ ని వదిలేది లేదు. అతని గురించి ఎవరెన్ని తప్పుగా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 1, 2023 / 05:10 PM IST
    Follow us on

    Emmanuel- Varsha

    Emmanuel- Varsha: సుధీర్ -రష్మీ తర్వాత ఆ రేంజ్ లో బుల్లితెర ప్రేమికులుగా పాపులర్ అయ్యారు వర్ష-ఇమ్మానియేల్. ఈ జబర్దస్త్ కమెడియన్స్ వారిద్దరినీ ఫాలో అవుతున్నారు. చెప్పాలంటే అంతకు మించి. వర్ష అయితే ఇమ్మానియేల్ మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తుంది. ఆమె చెప్పే ఎమోషనల్ లవ్ డైలాగ్స్ పిచ్చెక్కిస్తాయి. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం. నా పట్ల చాలా కేరింగ్ ఉంటాడు. ఎవరేమైనా అనుకోని ఇమ్మానియేల్ ని వదిలేది లేదు. అతని గురించి ఎవరెన్ని తప్పుగా చెప్పినా నేను నమ్మను… ఇలా చెప్పుకుంటూ పోతే వర్ష ఇమ్మానియేల్ ని ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగ్స్ చాలానే ఉంటాయి.

    వీరికి ఉత్తుత్తి పెళ్లి కూడా జరిగింది. ఆ మధ్య ఓ నగల దుకాణానికి తీసుకెళ్లి జ్యువెలరీ కొనిచ్చాడు. వర్ష-ఇమ్మానియేల్ విలక్షణమైన జంట. దీంతో వీరి లవ్ ట్రాక్స్ మీద ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అయితే వర్షకు కెరీర్ ఇచ్చిన ఘనత ఇమ్మానియేల్ దే. అతని లవర్ గా ప్రొజెక్ట్ చేసుకున్న వర్ష ప్రేక్షకులు దగ్గరయ్యారు.

    అత్తమ్మకు చెప్పేయ్ కోడలిని తీసుకువస్తున్నానని కూడా ఓ సారి కామెంట్ చేసింది. ఈ క్రమంలో ఎంతో కొంత ప్రేమ ఉందని జనాలు భావిస్తున్నారు. అయితే వేరే అబ్బాయితో ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వర్ష అడ్డంగా బుక్కైంది. అజ్ఞాతవ్యక్తితో ఉన్న వర్ష వీడియోలు బయటకు రావడంతో ఇమ్మానియేల్ మైండ్ బ్లాక్ అయ్యింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో… వర్ష మరొక అబ్బాయితో వీడియోలు చేస్తుందని హైపర్ ఆది ఇమ్మానియేల్ కి చెప్పాడు. చచ్చినా చేయదు, నేను నమ్మను అని ఇమ్మానియేల్ అన్నాడు. దాంతో నువ్వే చూడు అంటూ స్క్రీన్ మీద వర్ష వీడియోలు ప్లే చేశారు.

    Emmanuel- Varsha

    వర్ష వీడియోలు చూసి ఆవేశానికి లోనైన ఇమ్మానియేల్ ఎవడే వాడు? అంటూ వర్షను నిలదీశాడు. నా మీద నీకు అంత అనుమానం ఎందుకు ఇమ్మూ అని వర్ష ప్రశ్నించింది. ఈ ప్రశ్న నిజంగానే నన్ను అడుగుతున్నావా వర్షా? అని ఇమ్మానియేల్ తిరిగి ప్రశ్నించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసలు వర్షతో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? నిజంగా వర్ష ఇమ్మానియేల్ ని చీట్ చేసిందా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి.