
Rangasthalam On Japan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మైలు రాయి లాంటి చిత్రం ‘రంగస్థలం’.ఆయన కెరీర్ లో భవిష్యత్తులో దీనికి మించి ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ రావొచ్చు,కానీ రంగస్థలం లాంటి సినిమా రావడం చాలా అరుదు అనే చెప్పొచ్చు. కమర్షియల్ గా సూపర్ హిట్టై సుమారుగా 120 కోట్ల రూపాయిల షేర్ ని ఆరోజుల్లోనే వసూలు చేసిన ఈ సినిమా, నటుడిగా రామ్ చరణ్ కి తెచ్చిపెట్టిన కీర్తి ప్రతిష్టల గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.
మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా కోసం రామ్ చరణ్ కి వచ్చినన్ని అవార్డులు, టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలకు జీవిత కాలం లో కూడా అన్నీ అవార్డ్స్ వచ్చి ఉండవు అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు. అలాంటి సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయకపోవడమే మైత్రి మూవీ మేకర్స్ చేసిన అతి పెద్ద మిస్టేక్.
అయితే ఇన్నాళ్లకు ఈ సినిమా జపాన్ భాషలో దబ్ చేసి విడుదల చేయబోతున్నారట. ముందుగా ఈ నెల 9 వ తారీఖు నుండి 11 వ తారీఖు వరకు చోగో సిటీ లో ప్రదర్శించనున్నారు. మంచి రెస్పాన్స్ వస్తే,ఈ చిత్రాన్ని జపాన్ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవలే రామ్ చరణ్ నటించిన #RRR చిత్రం జపాన్ లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సుమారు 1 బిలియన్ కి జపనీస్ డాలర్స్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. రంగస్థలం చిత్రానికి కూడా ఆ రేంజ్ వసూళ్లు వసూళ్లు వచ్చే కెపాసిటీ ఉందని, మేకర్స్ మరియు హీరో కొద్దిగా ప్రొమోషన్స్ చేస్తే అది సాధ్యం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి రంగస్థలం సినిమా కోసం చరణ్ జపాన్ ప్రొమోషన్స్ లో పాల్గొంటాడా లేదా అనేది చూడాలి.