
MP Santosh Kumar- Hanuman Plant: కొన్ని ఐడియాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. ఆశ్చర్యం, వినూత్నత అనేది లేకుంటే జనాల గుండెల్లోకి చొచ్చుకు వెళ్లలేదు. చిప్కో ఉద్యమాన్ని సుందర్ లాల్ బహుగుణ జనాలకు అర్థమయ్యేలా తీసుకెళ్లాడు కాబట్టే లక్షలాది చెట్లను బతికించగలిగాడు. అశోకుడు లక్షలాది మొక్కలను నాటడమే కాదు.. వాటిని వృక్షాలు అయ్యేలాగా సంరక్షించాడు. అందుకే పాఠ్యపుస్తకాల్లో పాఠం అయ్యాడు. మేధాపాట్కర్ నర్మదా బచావో అనే ఉద్యమం చేయకుంటే.. అన్ని లక్షల అది మొక్కలు బతికేవా? ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య లక్షలాది మొక్కలు నాటాడు కాబట్టే పద్మశ్రీ పురస్కారాన్ని సాధించగలిగాడు. అంటే ఏ చరిత్ర చూసుకున్నా మొక్కలతోనే, మొక్కల వల్లే, మొక్కల కోసమే.
కానీ ప్రస్తుత నవీన యుగంలో అభివృద్ధి పేరిట ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. పచ్చని చెట్లు నేలకూలుతున్నాయి. అడవులు విలుప్తమవుతున్నాయి. అందుకే కదా ఏటా లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వందల కరోనాలు సృష్టించని ఉత్పాతాన్ని కాలుష్యం, భూతాపం కలిగిస్తున్నాయి. వీటన్నింటికీ కారణం చెట్లు నరకడం. మరి ఈ తరానికి చెట్లపై ప్రేమని ఎలా పెంచాలి? మొక్కలు నాటడాన్ని ఎలా అలవాటుగా మార్చాలి? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ విభిన్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఒక అద్భుతమైన చిత్రాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
హనుమంతుడికి సంజీవని వనాన్ని లేపుకొచ్చిన ఘనత ఉంది. లక్ష్మణుడి ప్రాణాన్ని నిలిపిన చరిత్ర ఉంది. కానీ ఆ సంజీవని వనం చెట్లతో కూడి ఉంది. ఇక్కడ హనుమంతుడు తీసుకొచ్చింది సంజీవని వనాన్ని మాత్రమే.. అందులో ఉన్న మొక్కల సారమే లక్ష్మణుడిని బతికించింది. అంతటి వీరాధివీరుడైన ఆంజనేయుడే మొక్కలు నాటుతున్నప్పుడు మనం ఎంత అనే అర్థం వచ్చేలా జోగినపల్లి సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాలో వైరల్ గా మారింది..

ఈ ఫోటోను చూసిన కొంతమంది యువత మొక్కలు నాటి సంతోష్ కుమార్ కు ట్యాగ్ చేస్తున్నారు. సమాజ క్షేమాన్ని ఆశించి ఇలాంటి ఫోటో పెట్టినందుకు సంతోష్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో భారీగా మొక్కలు నాటినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంతోష్ ను అభినందించింది.
Lord Hanuman, an epitome of devotion and strength. His courage and capabilities are next to none. May the mankind be showered by his holy blessings. #HappyHanumanJayanthi and #GreenIndiaChallenge to all. pic.twitter.com/JyVqaJcUe9
— Santosh Kumar J (@MPsantoshtrs) April 6, 2023