
Ranga Maarthaanda: ఇటీవల కాలం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన చిత్రం ‘బలగం’.ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. కమెడియన్స్ ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలంగాణ సంప్రదాయం ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించినందుకు గాను డైరెక్టర్ వేణు కి ప్రశంసల వర్షం కురిసింది.
అయితే ఇదే తరహా చిత్రం ‘రంగమార్తాండ’ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది.ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ వంటి నటీనటులు మరియు కృష్ణ వంశి లాంటి లెజండరీ డైరెక్టర్ గ్లామర్ ఈ సినిమాకి వసూళ్లు రప్పించడం లో ఏమాత్రం సహాయపడలేదు. అయితే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది, నెటిజెన్స్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరాఠి లో సూపర్ హిట్ గా నిల్చిన ‘నట సామ్రాట్’ అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం మరియు రమ్య కృష్ణ నటనకు అద్భుతమైన మార్కులు పడ్డాయి. కానీ ఎందుకో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. సరికొత్త పద్దతి లో ప్రొమోషన్స్ చెయ్యకపోవడం వల్లే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ అయ్యిందని విశ్లేషకుల అభిప్రాయం.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో కేవలం 24 గంటల్లోనే మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. మొదటి రోజు బలగం చిత్రానికి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదని అంటున్నారు విశ్లేషకులు.ఇక రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఓటీటీ లో ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పబోతుందో చూడాలి. థియేటర్స్ లో జనాలు ఆదరించకపోయిన కనీసం డిజిటల్ మీడియా లో ఆదరిస్తున్నందుకు మేకర్స్ సంతోషిస్తున్నారు.