
Jabardasth Comedian Punch Prasad: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ట్రీట్మెంట్ కి సంబంధించిన వీడియోను పంచ్ ప్రసాద్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయగా… విషయం వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన పంచ్ ప్రసాద్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీ సమస్య ఉంది. అది తీవ్ర రూపం దాల్చింది. కొన్నాళ్లుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆ మధ్య అసలు నడవలేని స్థితికి చేరాడు.
తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లగా వెన్నుపూస పక్కన చీము చేరిందని వైద్యులు చెప్పారట. దానికి సంబంధించిన చికిత్స తీసుకున్న పంచ్ ప్రసాద్ చక్రాల కుర్చీకి పరిమితం కావాల్సి వచ్చింది. కొంచెం కోలుకున్న తర్వాత తిరిగి ఈటీవి షోలలో కనిపిస్తున్నాడు. తోటి కమెడియన్స్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆరోగ్యం సరిగా లేకున్నా తమ స్కిట్స్ లో భాగం చేస్తూ… కొంత సంపాదన వచ్చేలా చేస్తున్నారు.

గతంలో జబర్దస్త్ జడ్జెస్ రోజా, నాగబాబు సైతం ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. మిత్రులు ఎంతగా ఆదుకున్న లక్షల్లో చికిత్సకు ఖర్చు అవుతుంది. దాంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తాజా వీడియోలో పంచ్ ప్రసాద్ నీరసంగా ఉన్నాడు. ట్రీట్మెంట్ లో భాగంగా ఆయన చేతికి యాభై సార్లు సూదులు గుచ్చారట. నా శరీరం చిల్లులు పడిపోతుందని పంచ్ ప్రసాద్ అంటున్నారు. ఆ వీడియో అభిమానులకు కన్నీరు తెప్పిస్తుంది. పంచ్ ప్రసాద్ కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.
ఆ మధ్య కిరాక్ ఆర్పీ పంచ్ ప్రసాద్ ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. త్వరలో మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. దాని మీద వచ్చే ఆదాయం పంచ్ ప్రసాద్ ట్రీట్మెంట్ కి ఖర్చు చేస్తాను. పది లక్షలు అయినా భరిస్తాను అన్నాడు. మణికొండలో కిరాక్ ఆర్పీ బ్రాండ్ ఓపెన్ చేశాడు. మరి చెప్పినట్లు ఏ మేరకు పంచ్ ప్రసాద్ కి సహాయం చేశాడో తెలియదు…
https://youtu.be/uGqa5rNeLRw