
Rana Naidu Collections: రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుపాటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ కి సోషల్ మీడియా లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. సిరీస్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో ట్రైలర్ లో చూపించిన దానికంటే పది రెట్లు ఎక్కువ ఉండడాన్ని వెంకటేష్ ని ఎంతగానో అభిమానించే వాళ్లకు మింగుడు పడలేదు. ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ఆయనని ఎన్నడూ కూడా ఇంత బోల్డ్ క్యారక్టర్ లో ఫ్యాన్స్ చూడలేదు. అలాంటిది ఒక్కసారిగా ఇంత ఊర మాస్ రోల్ లో చూసేసరికి మొదట్లో తీసుకోవడం చాలా కష్టం అయ్యింది.
కానీ ఒక్కోసారి నెగటివ్ పబ్లిసిటీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ‘రానా నాయుడు’ విషయం లో కూడా అదే జరిగింది.ఇన్ని భూతులున్నాయా, ఏముంది ఈ సిరీస్ లో ఒకసారి చూద్దాము అని అందరూ నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసారు. అలా రోజు రోజుకి ఈ సిరీస్ ని చూసి వారి సంఖ్య పెరుగుతూ పొయ్యింది.
అలా ఫ్లాప్ టాక్ తో ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్, చివరికి సూపర్ హిట్ అయ్యింది. అద్భుతమైన వ్యూస్ మరియు వాచ్ మినిట్స్ ని దక్కించుకున్న ఈ సిరీస్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనే టాప్ 1 స్థానం లో ట్రేండింగ్ అవుతుంది.ఇప్పటి వరకు ఈ సిరీస్ మొత్తానికి 5 రోజులకు కలిపి 200 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయట,రీసెంట్ గా విడుదలైన అన్నీ వెబ్ సిరీస్ లలో ఆల్ టైం రికార్డు గా నిలిచిందట.

అంతే కాదు , ఈ 5 రోజుల్లో కేవలం ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలు వంద కోట్ల రూపాయిల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరో మూడు వారాలు నాన్ టాప్ గా నెంబర్ 1 స్థానంలో ఇలాగే కొనసాగే అవకాశం ఉంటే మరో వంద కోట్ల రూపాయిలు లాభాలు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.