https://oktelugu.com/

Rana Naidu Trailer : రానా నాయుడు ట్రైలర్ రివ్యూ: రానా రాక్స్ వెంకీ షాక్స్, అసలు ఊహించలేదు బాబోయ్!

Rana Naidu Trailer విక్టరీ వెంకటేష్-రానా దగ్గుబాటి కలిసి నటిస్తే చూడాలన్న అభిమానుల కోరిక రానా నాయుడు రూపంలో తీరనుంది. ఈ ఇద్దరు ఫ్యామిలీ స్టార్స్ కాంబోలో రూపొందిన సిరీస్ రానా నాయుడు స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మార్చి 10వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు ప్రసారం  కానుంది. ఫిబ్రవరి 15న ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ కంప్లీట్ డిఫరెంట్ వెంకీ, రానాలను ఆవిష్కరించింది. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ వార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 15, 2023 / 10:02 PM IST
    Follow us on

    Rana Naidu Trailer విక్టరీ వెంకటేష్-రానా దగ్గుబాటి కలిసి నటిస్తే చూడాలన్న అభిమానుల కోరిక రానా నాయుడు రూపంలో తీరనుంది. ఈ ఇద్దరు ఫ్యామిలీ స్టార్స్ కాంబోలో రూపొందిన సిరీస్ రానా నాయుడు స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మార్చి 10వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు ప్రసారం  కానుంది. ఫిబ్రవరి 15న ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ కంప్లీట్ డిఫరెంట్ వెంకీ, రానాలను ఆవిష్కరించింది. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ వార్ గా రానా నాయుడు తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. 

     
    రానా నాయుడు ప్రొఫెషనల్ ఫిక్సర్. సమస్యల్లో ఉన్న సెలెబ్రిటీలు రానా నాయుడిని సంప్రదిస్తారు. ఇబ్బంది ఏదైనా తనకు తెలిసిన మార్గాల్లో సొల్యూషన్ చూపిస్తాడు. దానికోసం ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారానికైనా పాల్పడతాడు. తన దందా సాఫీగా సాగుతున్న సమయంలో తండ్రి నాగా నాయుడు జైలు నుండి బయటకు వస్తాడు. నాగా నాయుడు కారణంగా రానా నాయుడికి సమస్యలు మొదలవుతాయి. ఇద్దరికీ మధ్య ఎమోషనల్ వార్ నడుస్తుంది. తన ఫ్యామిలీని ఎంతగానో ప్రేమించే రానాలో భయం ఏర్పడుతుంది. 
     
    రానా నాయడు-నాగా నాయుడు మధ్య ఏం జరగనుంది. క్రైమ్ వరల్డ్ లో వీరి పాత్ర ఏమిటనేదే రానా నాయుడు సిరీస్. బోల్డ్ సన్నివేశాలతో పాటు బూతు పదాలతో ట్రైలర్ నింపేశారు. ముఖ్యంగా వెంకీ పాత్ర చాలా రఫ్ గా ఉంది. ఆయన డైలాగ్స్ బూతులు కూడి ఉన్నాయి. వెంకీ ఇమేజ్ కి భిన్నమైన రోల్ అని చెప్పొచ్చు. హిందీ బూతులు మన తెలుగు వాళ్ళకు బహుశా అందరికీ అర్థం కాకపోవచ్చు. తెలుగులో మక్కీకి మక్కీ అనువదిస్తే జీర్ణించుకోవడం కష్టమే. అంత పెద్ద బూతులు ఉన్నాయి. సుర్విన్ చావ్లా మరో కీలక రోల్ చేస్తున్నారు. అన్షుమాన్ అండ్ సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. రానా,వెంకీల ఈ డెబ్యూ సిరీస్ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ రే డొనోవన్ కి రానా నాయుడు అధికారిక రీమేక్. రే డోనోవన్ 12 ఎపిసోడ్స్ చొప్పున ఏకంగా 7 సీజన్స్ లో ప్రసారమైంది. 
     
    రానా నాయుడు సిరీస్ నెట్ఫ్లిక్స్ భారీగా సబ్స్క్రైబర్స్ తెచ్చిపెడుతుందని యాజమాన్యం నమ్ముతున్నారు. అమెజాన్ ప్రైమ్ తో పోల్చితే నెట్ఫ్లిక్స్ మార్కెట్ విస్తరణలో స్ట్రగుల్ అవుతుంది. ఈ విషయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దూసుకుపోతుంది. అన్ని భాషల ఆడియన్స్ నుండి ఆదరణ రాబట్టేందుకు నెట్ఫ్లిక్ పెద్ద ఎత్తున ప్రణాళికలు వేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాల  డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భోళా శంకర్, ఎస్ఎస్ఎంబీ 28 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. 
    Tags