
Junior NTR- Ram Gopal Varma: ఒకప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు తీసి ఇప్పుడు బ్లూ ఫిల్మ్స్ తీసుకునే రేంజ్ కి పడిపోయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎల్లప్పుడూ తనకి అసలు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో దూరి, నోటికి వచ్చినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అటెన్షన్ ని రాబట్టలనుకుంటాడు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , చంద్ర బాబు నాయుడు మరియు చిరంజీవి పై ఈయన రోజూ ఎదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు.ఇప్పుడు రీసెంట్ గా ఆయన చూపు జూనియర్ ఎన్టీఆర్ మీద పడింది.
గతం లో కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు, తన పనేదో తానూ చేసుకుంటూ, అసలు రాజకీయాలకే సంబంధం లేకుండా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చెయ్యాల్సిన అవసరం ఏమిటి..? ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘తన తాతయ్యని ఘోరాతి ఘోరాంగా టార్చర్ పెట్టి
వెన్నుపోటు పొడిచి చంపేసిన చంద్రబాబు నాయుడు ని ఎలా ముందు పోటు పొడవాలన్న నా మనసులోని ఆలోచన, భలే పట్టాడ్రా RGV గాడు ఆన్నటుంది ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే’ అంటూ రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు,ఖాళీగా ఉంటే అషు రెడ్డి లాంటోళ్ళతో ఇంటర్వ్యూస్ చేసుకో,మా ఎన్టీఆర్ అన్న జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మ కి రిప్లై లో వార్నింగ్ ఇస్తున్నారు.నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ మీద కూడా ఇలాంటి కామెంట్స్ చేసాడు.పవన్ కళ్యాణ్ కి అసలు జ్ఞానం లేదని, రెండు లక్షల పుస్తకాలూ చదివాను అంటాడు, ఒక 20 పుస్తకాల పేర్లు చెప్పమనండి చూద్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు, పవన్ అభిమానులు రామ్ గోపాల్ వర్మని ఒక పిచోడి లాగ భావించి అతని కామెంట్స్ ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలా చేస్తారో లేదో చూడాలి.