Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma- Avatar 2: ఆ రోజు మనుషులంతా చనిపోవాలి అనుకుంటారు... అవతార్...

Ram Gopal Varma- Avatar 2: ఆ రోజు మనుషులంతా చనిపోవాలి అనుకుంటారు… అవతార్ 2ని ఉద్దేశిస్తూ వర్మ సంచలన ట్వీట్!

Ram Gopal Varma- Avatar 2: ప్రపంచ సినిమా ప్రేమికులు జేమ్స్ కామెరూన్ వెండితెర అద్భుతం అవతార్ 2 ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. పార్ట్ 1 స్థాయిలో మెప్పించలేదనే వాదన వినిపిస్తోంది.అయితే అవతార్ సినిమాను రివ్యూలు చేయడం సబబు కాదు. అది సినిమాకు మించిన విజువల్ వండర్. విమర్శలు మాని కామెరూన్ సృష్టిని ఆస్వాదించండని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక టాక్ తో సంబంధం లేకుండా అవతార్ 2 కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ ఓపెనర్ గా అవతరించింది. అవెంజర్స్ ది ఎండ్ గేమ్ మూవీ తర్వాత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

Ram Gopal Varma- Avatar 2
Ram Gopal Varma- Avatar 2

అంతర్జాతీయంగా అవతార్ 2 మూవీపై చర్చ జరుగుతుండగా వర్మ తనదైన శైలిలో స్పందించారు. అవతార్ 2 చిత్రంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవతార్ 2 చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. అవతార్ 2 లో ఒక అందమైన జల ప్రపంచాన్ని చూపించారు. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే నటుల ప్రదర్శన, ఆడియన్స్ లో ఉత్కంఠ రేపాయి. ఆడియన్స్ ఊపిరి తీసుకోవడం కూడా మరచి మూవీ చూశారు. దర్శకుడు అందమైన గ్రహాన్ని సృష్టించారు. పండోర గ్రహంలో నాకు కూడా నివసించాలని ఉంది. స్వర్గం ఒకవేళ పండోర గ్రహంలా ఉంటే మనుషులు అందరూ చనిపోయి… పండోర గ్రహానికి వెళ్లాలని అనుకుంటారు, అని వర్మ తన అభిప్రాయపడ్డారు.

స్వర్గం కంటే అందంగా, దేవుని సృష్టి కంటే అద్భుతంగా జేమ్స్ కామెరూన్ ఒక ఊహాజనిత లోకాన్ని వెండితెరపై ఆవిష్కరించారని వర్మ తెలియజేశారు. వర్మను అవతార్ 2 ఎంతగానో ఆకట్టుకుందని ఆయన మాటలు చూస్తే అర్థం అవుతుంది. వర్మ ఈ మధ్య కాలంలో ఏ చిత్రాన్ని ఈ స్థాయిలో పొగడలేదు. ఒక గొప్ప సినిమాకు తగ్గ పోలికలు ఇచ్చారు. ఈ క్రమంలో అవతార్ 2 మూవీపై వర్మ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ram Gopal Varma- Avatar 2
Ram Gopal Varma- Avatar 2

 

2009లో విడుదలైన అవతార్ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. అవతార్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. $2.92 బిలియన్ వసూళ్లతో వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది. 13 ఏళ్ళు అవుతున్నా అవతార్ రికార్డు ఏ చిత్రం బ్రేక్ చేయలేదు. అవెంజర్స్ ది ఎండ్ గేమ్ మాత్రమే ఆ చిత్ర దరిదాపుల్లోకి వెళ్ళగలిగింది. అవతార్ రికార్డ్స్ అవతార్ 2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అది సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. అవతార్ పార్ట్ 1 కి వచ్చినంత ఆదరణ సీక్వెల్ కి దక్కలేదు. ఓపెనింగ్ వసూళ్లు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version