
Ram Gopal Varma- Gadwal Vijayalakshmi: హైదరాబాద్ నగర నడిబొడ్డున పిల్లాడిపై కుక్కలు దాడి చేసి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదారు కుక్కలు అత్యంత క్రూరంగా బాలుడిని వేటాడాయి. ఆ సీసీ టీవీ ఫుటేజ్ అత్యంత భయంకరంగా ఉంది. ఎవరో ఉసిగొల్పినట్లు అవి విరుచుకుపడ్డాయి. ఒంటరిగా ఉన్న పిసవాడు నిస్సహాయత మధ్య ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటనను తెలంగాణా హైకోర్ట్ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. హైదరాబాద్ కలెక్టర్, కమీషనర్ లతో పాటు సంబంధిత అధికారులను ప్రతివాదులుగా చేర్చింది. పిల్లాడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసు మార్చి 16కి వాయిదా వేశారు.
కాగా ఈ ఘటనపై ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వంతో పాటు హైదరాబాద్ పాలక వర్గాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి గద్వాల్ వీధి కుక్కల పట్ల సానుభూతి చూపుతూ మాట్లాడటం వివాదాస్పదం అవుతుంది. కుక్కలు అలా ప్రవర్తించడానికి ఆమె కారణాలు తెలిపారు. ఒక మహిళ ఆ కుక్కలకు రోజూ మాంసం ఆహారంగా పెట్టేది. ఆమె రెండు రోజుల లేకపోవడం వలన మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు పిల్లాడిపై దాడి చేశాయన్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని సలహా ఇచ్చారు.

ఒక అమానవీయ సంఘటనపై మేయర్ స్పందించిన తీరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నచ్చలేదు. ఆయన వరుస ట్వీట్స్ తో ఆమెపై విమర్శలు గుప్పించారు. ఒక ఐదు లక్షల వీధి కుక్కల మధ్య ఆమెను ఉంచాలని ట్వీట్ చేశారు. అలాగే ఒక వీడియో బైట్ విడుదల చేశారు. మేయర్ విజయలక్ష్మి గద్వాల్ కి ఎలాంటి అనుభవం ఇవ్వాలో కేటీఆర్ కి వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.
‘కేటీఆర్ గారు విజయలక్ష్మి గద్వాల్ ని మీరు ఎలా మేయర్ చేశారో తెలియదు. నాకు ఈ పొలిటికల్ సిస్టమ్స్ మీద కూడా అవగాహన లేదు. ఒక ఐదువేల వీధి కుక్కలను ఆమె ఇంట్లోకి పంపి తెలుపు, తాళాలు, గేట్లు వేసేయండి. అప్పుడు ఆమె ఎంతగా వాటిని ప్రేమిస్తారో. ఆ కుక్కలను పోషిస్తారో. వాటికి ఆహారం పెడతారో మనం చూద్దాం. ఇది నా రిక్వెస్ట్..’ అంటూ వీడియో బైట్ విడుదల చేశారు. పూర్తిగా ఇది వ్యవస్థల వైఫల్యం అని ఆయన వాదిస్తున్నారు. ఈ ఘటనలో యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీధి కుక్కలకు మద్దతుగా మాట్లాడారు. ఆమెను కూడా నెటిజెన్స్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేస్తున్నారు.
Sir @KTRBRS please round up all the 5 lakh dogs into a dog home and make the mayor @GadwalvijayaTRS stay in their middle 🙏 pic.twitter.com/rWe6sC9Ga4
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
Hey @GadwalvijayaTRS I WANT TO BITE @KTRBRS @hydcitypolice pic.twitter.com/bXTFqsxzzH
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023