
Gautam Adani: కాలం కలిసి వస్తే ఒక మనిషి రాత్రికి రాత్రే అపార కుభేరులు అవ్వగలరు, కాలం కలిసి రాకపోతే రాత్రికి రాత్రే తన సంపద మొత్తాన్ని కోల్పోయి పాతాళలోకానికి పడిపోగలరు.ఇది ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే నెల రోజుల క్రితం నెలకి 120 బిలియన్ డాలర్లను సంపాదిస్తూ ప్రపంచం లో అపరకుభేరుల జాబితా లో టాప్ 3 స్థానం లో నిల్చిన గౌతమ్ అదానీ నెల రోజుల వ్యవధిలోనే 50 బిలియన్ డాలర్ల కంటే తక్కువ స్థానానికి పడిపోయి టాప్ 25 వ స్థానం లో నిలిచాడు.
ఇది నిజంగా ఊహించని పరిణామం అనే చెప్పాలి.రాబొయ్యే కాలం లో ఆయన షేర్ విలువ మొత్తం పడిపోయి ఇంకా దిగువ స్థానానికి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు.ఒక్క నెల గ్యాప్ లోనే అదానీ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది..?,అదానీ గ్యాస్ , అదానీ పోర్ట్స్ & లాజిస్టిక్స్ , అదానీ రెన్యువబుల్స్ , అదానీ కోల్ & మైనింగ్ , అదానీ పవర్ స్టేషన్స్ ఇలా ప్రతీ రంగం లోను వేలు పెట్టి లక్షల కోట్ల రూపాయిలను ఆర్జిస్తున్న అదానీ పరిస్థితి అకస్మాత్తుగా ఇలా పడిపోవడానికి కారణం ఏమిటి..? అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే అమెరికా కి చెందిన హిండన్ బర్గ్ రీసెర్చ్ & రిపోర్టింగ్ సంస్థ ఇటీవల అదానీ గ్రూప్స్ సంస్థల పై రీసెర్చ్ చేసింది.ఈ రీసెర్చ్ లెక్కల్లో లేని బోలెడన్ని స్కామ్స్ ఉన్నాయని హిందీన్ బర్గ్ సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చెయ్యడం తో ఒక్కసారిగా అదానీ గ్రూప్స్ షేర్లు అన్ని స్టాక్ మార్కెట్ లో దారుణంగా పడిపోయాయి.హిండన్ బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ని అదానీ గ్రూప్స్ వ్యతిరేకించినప్పటికీ పెట్టుబడిదారులకు అదానీ గ్రూప్స్ పై పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం నమ్మకం చూపలేదు.

దాంతో ఒక్కసారికి గౌతమ్ అదానీ ఆదాయం దారుణంగా పడిపోయింది.ఇక ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 89 బిలియన్ డాలర్ల సంపాదన తో ఇండియా తరుపున నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు.మరి భవిష్యత్తులో అయినా అదానీ గ్రూప్స్ కోలుకుంటుందా లేదా ఇంకా దిగజారిపోతుందా అనేది చూడాలి.