
Ram Charan- Kiara Advani: బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ పెళ్లి చేసుకున్న విజయం తెలిసింది. ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ఏడడుగులు నడిచారు. కియారా-సిద్దార్థ్ ల వివాహానికి జైసల్మేర్ లో గల సూర్య ఘడ్ ప్యాలెస్ వేదికైంది. అత్యంత సన్నిహితుల మధ్య ఫిబ్రవరి 7న కియారా వివాహం జరిగింది. దాదాపు ఐదేళ్లుగా కియారా-సిద్ధార్థ్ రిలేషన్ లో ఉన్నారు. కొన్ని నెలలుగా పెళ్లి వార్తలు వస్తున్నాయి. షేర్షా మూవీలో సిద్దార్థ్ కి జంటగా కియారా అద్వానీ నటించారు. జంటగా విహరిస్తూనే తమ రిలేషన్ పై అధికారిక ప్రకటన చేయలేదు.
పెళ్లి అనంతరం కియారా దంపతులు ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ మొత్తం తరలి వెళ్ళింది. తారలతో రాకతో సందడిగా వేడుక జరిగింది. కాగా టాలీవుడ్ నుండి హీరో రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం లభించిందట. రామ్ చరణ్ ని పెళ్ళికి కూడా ప్రత్యేకంగా కియారా ఇన్వైట్ చేశారట. అనుకోని కారణాలతో రామ్ చరణ్ దంపతులు హాజరు కాలేకపోయారు. అయితే ఆర్సీ 15 సెట్స్ నుండి ఊహించిన పెళ్లి కానుక ఇచ్చారు.
ఆర్సీ 15 సెట్స్ వేదికగా కియారాకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు తో పాటు యూనిట్ మొత్తం ఒక చోట చేరి శుభాకాంక్షలు చెప్పారు. ఆమె వైవాహిక జీవితం బాగుండాలని కోరుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా కియారా స్పందించారు. రామ్ చరణ్ ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ తనకు బాగా నచ్చిందట. ఆర్పీ 15 యూనిట్ కి ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు.

చరణ్ తో కియారాకు మంచి స్నేహ బంధం ఉంది. ముంబై వెళ్ళినప్పుడు కియారా-చరణ్ కలిసి మాట్లాడుకుంటారు. గతంలో వీరి కాంబోలో వినయ విధేయ రామ తెరకెక్కింది. బోయపాటి శ్రీను ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. అప్పటి నుండి స్నేహం కొనసాగుతుంది. ఇక ఆర్సీ 15 మూవీతో మరోసారి చరణ్-కియారా జతకడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. మరో హీరోయిన్ గా అంజలి నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఇది 50వ చిత్రం.
Also Read: Kotamreddy Sridhar Reddy: ట్రోల్ ఆఫ్ ది డే: అడ్డంగా దొరికిపోయిన కోటం హాసన్
Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life!
Wishing you a lifetime of happiness, love and light❤
Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI
— Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023