
Jagapathi Babu: నిన్నటి తరం హీరోలలో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో మరియు లేడీస్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న హీరో ఎవరు అంటే అది జగపతి బాబు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.సుమారు 70 కి పైగా సినిమాల్లో హీరో గా నటించిన జగపతి బాబు, హీరో గా ఫేడ్ అవుట్ అయినా తర్వాత బాలయ్య బాబు లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా మారాడు.
Also Read: Ram Charan- Kiara Advani: కొత్త పెళ్లికూతురు కియారా అద్వానీకి రామ్ చరణ్ సర్ప్రైజ్ గిఫ్ట్!
ఆ సినిమాలో జగపతి బాబు నటన బాలయ్యతో సరిసమానంగా పోటాపోటీగా ఉంటుంది.ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో జహాపతి బాబు సౌత్ ఇండియా లో మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా బాగా బిజీ అయిపోయాడు.ఇప్పుడు మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి ఈయన డేట్స్ దొరకడమే ఒక అదృష్టం లాగ మారిపోయింది.

ఇది ఇలా ఉండగా రీసెంట్ జగపతి బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ ప్రారంభం లో ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడో చెప్పుకొచ్చాడు.ఇదంతా విన్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ నిర్మాత కొడుక్కి కూడా ఇలాంటి అవమానాలు ఎదురు అవుతాయా అని ఆశ్చర్యపోక తప్పదు.ఆయన మాట్లాడుతూ ‘కెరీర్ ప్రారంభం లో నేను సాహసం అనే సినిమా చేశాను, ఇందులో నాది సెకండ్ హీరో పాత్ర.షూటింగ్ హైదరాబాద్ లో కాకుండా వేరే లొకేషన్ లో పెట్టడం తో ఇంటి ఫుడ్ ని బాగా మిస్ అయ్యేవాడని,డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే రకరకాల రుచికరమైన వంటకాలు ఉంటె ముద్ద దిగని నన్ను ఆ చిత్ర నిర్మాత పస్తులు ఉంచేవాడు..షూటింగ్ వారం రోజుల పాటు జరిగితే ఆ వారం రోజులు నేను అన్నం లేకుండానే బ్రతికాను.ఆ రోజు నాకు జరిగిన ఆ అవమానం నాకు జీవితం లో ఎంతో మంచి గుణపాఠం నేర్పింది.కొత్తగా వచ్చిన హీరో అవ్వడం తో చాలా చులకనగా చూసేవాళ్ళు’ అంటూ జగపతి బాబు ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.