
Ram Charan- Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో గత ఏడాది విడుదలైన ‘ఆచార్య’ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే.కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా చిరంజీవి – రామ్ చరణ్ కెరీర్ లోనే అతి చెత్త సినిమా అని, కొరటాల శివ మళ్ళీ తలచుకొని తియ్యాలనుకున్నా కూడా ఇంత చెత్త సినిమా తియ్యలేడు అంటూ కొరటాల శివ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మెగా ఫ్యాన్స్.
ఇక కొరటాల శివ పై కూడా ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం చాలా గట్టిగానే తగిలింది.ఎందుకంటే ఆయన ఈ సినిమా బిజినెస్ లో కూడా తలదూర్చాడు కాబట్టి.భారీ నష్టాలు రావడం తో బయ్యర్స్ అందరూ కొరటాల శివ ఇంటి ముందు ధర్నా కి దిగారు.ఎలాగో మొత్తానికి ఆ గండం నుండి బయటపడి ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి సన్నాహాలన్నీ పూర్తి చేసాడు.
అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది, ఇది ఇలా ఉండగా కొరటాల శివ తదుపరి చిత్రం పై సోషల్ మీడియా లో ఒక వార్త ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతుంది.అదేమిటిటంటే ఎన్టీఆర్ చిత్రం పూర్తి అవ్వగానే కొరటాల శివ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా ప్రారంభించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.గత కొద్దీ రోజుల క్రితమే కొరటాల శివ కి వచ్చిన ఒక యూనీక్ ఐడియా ని రామ్ చరణ్ తో షేర్ చేసుకొని ఈ సబ్జెక్టు మీద సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్నాడట.

రామ్ చరణ్ కి కూడా ఆ పాయింట్ బాగా నచ్చడం తో స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రమ్మని చెప్పాడట.వాస్తవానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది, కానీ కథ కుదరక ఇన్ని రోజులు రాలేదు,ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చినా కూడా రామ్ చరణ్ కొరటాల తో సినిమా చెయ్యడానికి సిద్దమయ్యాడు అంటే ఆయన గట్స్ కి మెచ్చుకోవచ్చు.మరి కొరటాల శివ ఈసారైనా రామ్ చరణ్ కి సరైన హిట్ ఇస్తాడో లేదో చూడాలి.