Ram Charan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అంటూ నిన్న మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పెట్టిన ఒక ట్వీట్ ఎంత వైరల్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..మెగా ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారు..సుమారుగా పదేళ్ల నుండి ఈ వార్త కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు..ఈ విషయం పై సోషల్ మీడియా లో ఉపాసన మరియు రామ్ చరణ్ మీద గతంలో ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా అభిమానులు భరించారు.

చివరికి ఆ కామెంట్స్ అన్నిటికీ సమాధానం దొరకడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఇప్పుడు మరొక్క వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది..అదేమిటంటే రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టబోతున్నారట..ఉపాసన తన సన్నిహితులకు ఈ విషయం పంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అదే కనుక జరిగితే మన టాలీవుడ్ స్టార్ హీరోలలో కవల పిల్లలు కలిగిన ఏకైక తండ్రి గా రామ్ చరణ్ నిలుస్తాడు.
ఈ ఏడాది #RRR వంటి సినిమాతో అంతర్జాతీయ లెవెల్ లో గుర్తింపు దక్కించుకోవడం తో ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కి ఎంపిక అవుతున్నాడు రామ్ చరణ్..కెరీర్ పరంగా అభిమానులను గర్వపడేలా చేస్తూనే మరోపక్క వ్యక్తిగతంగా కూడా రామ్ చరణ్ అభిమానుల్లో సంతోషం నింపాడు..ఇక ఆయన తదుపరి సినిమాల విషయం లో కూడా ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో ఉన్నటువంటి క్రేజీ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కి కూడా లేదు.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న రామ్ చరణ్, ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో ఒక సినిమా , ఈ సినిమా పూర్తి అయినా వెంటనే సుకుమార్ తో మరో సినిమా చేస్తున్నాడు..వీరితో పాటుగా లోకేష్ కనకరాజ్ , రాజమౌళి, ప్రశాంత్ నీల్ మరియు రాజ్ కుమార్ హిరానీ వంటి వారు కూడా లైన్ లో ఉన్నారు..అలా రామ్ చరణ్ ఇండియాలోనే మోస్ట్ క్రేజీ లైనప్ ఉన్న పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా నిలిచాడు.