Pathan Movie Besharam Song: ఈ పాట గురించి సమీక్షిస్తున్నందుకు ముందుగా మమ్మల్ని క్షమించాలి. ఓ పది శాతం బాడీని కవర్ చేసేందుకు రెండు గుడ్డ పేలికలు.. మిగతాదంతా బరిబాతల యవ్వరామే. నిన్న విడుదలైన షారుక్ పఠాన్ సినిమాలో బేశరం అనే పాట గురించి రెండు ముక్కల్లో ఇచ్చే రివ్యూ ఇది.. వాస్తవానికి ప్రాంతీయ సినిమాలతో పోలిస్తే హిందీ సినిమాల్లో వెగటు, కొత్త ప్రదర్శనలు చాలా ఎక్కువ.. ఇక ఈ సంవత్సరం మొదట్లో గెహరాయియా అనే ఒక సినిమా వచ్చింది. ఇందులో దీపిక హీరోయిన్. కథ మొత్తం ఆమె చుట్టూనే సాగుతుంది. అందులో సహనటుడు సిద్ధాంత్ తో ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిన తీరు చూసి చాలామంది నోర్లు వెళ్లబెట్టారు. నిజానికి ఆ కథకు అంత ఎక్స్పోజింగ్ అవసరం లేదు.. అదేదో అప్పట్లో వచ్చిన మల్లికా శెరావత్ మర్డర్ సినిమాలా ఉంది. మల్లిక అంటే ఐటెం పాటలు చేసింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ తక్కువ. కానీ దీపికాకు ఏం పుట్టింది. పీకూ, ఓం శాంతి ఓం, వంటి మంచి సినిమాల్లో నటించింది కదా! అసలు ఆ సినిమాలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ రోతగా అనిపించింది.. దానికి కరణ్ జోహార్ దర్శకుడు.. థియేటర్లలో రిలీజ్ చేసే వీలుకాక అమెజాన్ ప్రైమ్ లో వదిలారు.. దీపిక చేసినట్టు సౌత్ సినిమాల్లో కాస్త పేరు తెచ్చుకున్న ఏ నటిని అడిగినా కూడా అందులో నటించేందుకు ఒప్పుకోదు.

నోటిలో ఇనుప గుగ్గిళ్ళు వేసుకున్నంత దరిద్రంగా ఉంది
ఈ పాట బేశరం అంటూ సాగుతుంది. దీనికి తెలుగులో నా నిజం రంగు అంటూ అనువదించారు. నోట్లో ఇనుప గుగ్గిళ్ళు వేసుకుని నమిలినంత కటువుగా ఉంది ఆ పాట. ఆ అనువాదం చేసినోడికి దండం పెట్టాలి. చివరకు ఇలాంటి సినిమాలు చూసి, ఇందులో పాటలు చూసి ఆర్యన్ ఖాన్ లాంటి మీ కొడుకులే డ్రగ్స్ కు అలవాటు అయిపోతారు. నార్కోటిక్స్ కు దొరికిపోతారు. పైగా వారికి మద్దతుగా ట్విట్టర్ గ్యాంగ్ ట్వీట్లు సరే సరి. అన్నట్టు బేశరం రంగ్ అంటే సిగ్గులేని రంగు అని అర్థమా.. అంటే ఈ లెక్కన సిగ్గులేనితనం అనుకోవాలా? ఏమో ఈ పాట చూస్తే నిజంగా అలాగే అనిపిస్తుంది. ఇక దీపిక అయితే ఒంటినిండా బట్టలే లేవు. ఆ రెండు పీలికలు మాత్రం ఎందుకు వేసుకుందో ఆమెకే తెలియాలి..

డర్టీ పిక్చర్
సినిమా తారలు మొత్తం విప్పేసి నటించిమన్నా నటిస్తారు.. ఆ డర్టీ అండ్ అగ్లీ సీన్లకు షారుక్ ఖాన్ ఎలా అంగీకరించాడు? దీపిక ఎలాగూ అన్ని వదిలేసింది.. సినిమాకు వచ్చే ఫ్యామిలీ ఆడియోస్ పరిస్థితి ఏంటి.. దరిద్రం కొద్దీ ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తారట.. హిందీలో ఈ పాట ట్రెండింగ్ లో ఉందట.. ఏం సినిమాలు తీస్తర్రా భయ్.. ఒక్కొకడు ఒక్కో కరణ్ జోహార్, రాంగోపాల్ వర్మల తయారయ్యారు. ఒకడు కాళ్ళు నాకుతాడు. ఇంకొకడు హీరోయిన్ కు వస్త్రాలు లేకుండా చేస్తాడు. ఇంకా ఈ సినిమాలో షారుక్ ఖాన్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడట.. అది సిక్స్ ప్యాక్ కాదు స్వామి…సిక్స్ టీ ప్యాక్. ఆ గ్లిజరిన్ లేకుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడలేం. కానీయండి కానీయండి… మీరు ఇలాగే సినిమాలు తీయండి… ఓ కాంతారా, ఆర్ ఆర్ ఆర్,కేజీ ఎఫ్_2 వసూళ్ళు సాధిస్తే గగ్గోలు పెట్టండి