
ఇటీవలే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కరోనా బారినపడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనావైరస్ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రముఖులు.. అభిమానులందరికీ రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా తనకు విషెస్ తెలిపిన వారికి చరణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. మహేష్ బాబు తాజాగా చేసిన ట్వీట్‌లో రామ్ చరణ్ జాగ్రత్తలు తీసుకోవాలని.. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు
మహేష్ ట్వీట్ చేస్తూ “చరణ్ జాగ్రత్తలు తీసుకోండి .. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను! సురక్షితంగా ఉండండి. ” అని సూచించారు. దీనికి రాంచరణ్ కూడా స్పందించాడు. “మహేష్ నా ఆరోగ్యం గురించి ఆరా తీసినందుకు ధన్యవాదాలు” అని సమాధానం ఇచ్చారు.
రామ్ చరణ్, మహేష్ బాబు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్స్ క్రమం తప్పకుండా కలిసి పార్టీల్లో పాల్గొంటారు.
రామ్ చరణ్ ప్రస్తుతం ఇంటిలోనే క్వారంటైన్ లో ఉంటున్నాడు. రామ్ చరణ్ భార్య ఉపాసనకు పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. ఈ మేరకు ఉపాసన ట్వీట్ చేసింది, “నేను పరీక్షలు చేసుకోగా నెగటివ్ వచ్చింది. కానీ చరణ్ తో సన్నిహితంగా ఉన్న నాకు కోవిడ్ పాజిటివ్‌గా రావడానికి అవకాశం ఉందని.. తాను క్వారంటైన్ లో ఉన్నట్టు” పేర్కొంది.
ఇదిలా ఉంటే రాంచరణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను వాయిదా వేసినట్టు సమాచారం. రామ్ చరణ్ – అలియా భట్ ల మధ్య ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.